Gambhir vs MS Dhoni: సుదీర్ఘ ఫార్మాట్లో ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతోందని మేనేజ్మెంట్ టీమిండియా పై ఆగ్రహం గానే ఉంది. ముఖ్యంగా గంభీర్ పై ఒక రకమైన నిరాశ భావంతోనే ఉంది. ఇలాంటి సమయంలో జట్టును దారిలో పెట్టాలి.. విజయాలు సాధించాలి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో ప్రవేశించి ట్రోఫీ అందుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో బాగానే ఒక మెంటార్ ను ఏర్పాటు చేసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆస్థానంలో ధోని అయితే బాగుంటాడని మేనేజ్మెంట్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాలో ఒక రకమైన చర్చ జరుగుతున్నది. ఒకవేళ ధోని గనక మెంటార్ అయితే గంభీర్ ఊరుకుంటాడా.. మేనేజ్మెంట్ నిర్ణయాన్ని సమర్థిస్తాడా.. అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.
2007లో టీమిండియా పొట్టి ఫార్మాట్లో వరల్డ్ కప్ సాధించినప్పుడు.. 2011లో పరిమిత ఓవర్లలో వరల్డ్ కప్ అందుకున్నప్పుడు.. టీమిండియాలో గంభీర్ ఒక సభ్యుడు. అప్పట్లో ధోని నాయకత్వం పట్ల విపరీతమైన ప్రశంసలు లభిస్తున్న నేపథ్యంలో గంభీర్ స్పందించాడు. జట్టులో అందరూ ఆడితేనే విజయం సాధ్యమైందని.. ఒక్కడి కృషి వల్ల జట్టు విజయాలు సాధించలేదని తన అగ్రహాన్ని వ్యక్తం చేశాడు.. అప్పట్లో గంభీర్ మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి. గంభీర్ ఎలాంటి మాటలు మాట్లాడినప్పటికీ 2007 లో పొట్టి ప్రపంచ కప్.. 2011లో పరిమిత ఓవర్ల ప్రపంచ కప్.. అందించిన ఘనత ధోనికి దక్కుతుంది. అంతేకాదు ఐపీఎల్లో చెన్నై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీలు అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు ధోని. 2020లో అతడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై జట్టుకు ఆడుతున్నాడు.
అయితే ఇటీవల కాలంలో సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ ఇండియా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. మరోవైపు రెండు సంవత్సరాల తర్వాత పరిమిత ఓవర్లలో ప్రపంచ కప్ టోర్నీలో భారత్ పాల్గొనాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగే ఆటోర్నీలో టీమిండియా ఎలాగైనా విజయం సాధించి ట్రోఫీ అందుకోవాలని భావిస్తుంది. ఇన్ని టార్గెట్లు ముందన్న నేపథ్యంలో జట్టుకు ఒక మంచి మెంటార్ ఉండాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అందువల్లే ధోని ఆస్థానంలో నియమించాలని యోచిస్తోంది. 2020లో ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత.. 2021 లో ధోని సేవలను మేనేజ్మెంట్ ఉపయోగించుకుంది. అయితే ఏడాది వరకు మాత్రమే ధోని జట్టుకు పరోక్షంగా సేవలు అందించాడు. ఇప్పుడు అతడి సేవలను యువజట్టుకు ఉపయోగించుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. మరి దీనిని గంభీర్ సానుకూలంగా స్వీకరిస్తాడా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. ఇటీవల ఒక కార్యక్రమాల్లో ధోని, గంభీర్ ఒకే వేదికను పంచుకున్నారు. ఆ సమయంలో వారిద్దరు సరదాగా సంభాషించుకున్నారు.