Team India New jersey : బ్రిటీష్ సామ్రాజ్యం నుండి భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలను పురస్కరించుకున్న సందర్భంగా బీసీసీఐ టీమిండియా సరికొత్త జెర్సీని ఆవిష్కరించింది. అదిప్పుడు వైరల్ అవుతోంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఆగష్టు 15, 2022న కొత్త జెర్సీ డిజైన్‌ను ఆవిష్కరించింది.. భారతదేశం ఈరోజు 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా టీమిండియాకు ఈ సరికొత్త జెర్సీని కానుకగా ఇస్తున్నామని తెలిపింది.

భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను భారత క్రికెట్ సోదరులతో పంచుకునేందుకు ఈ జెర్సీని రూపొందించినట్టు బీసీసీఐ తెలిపింది. బిసిసిఐ ట్విట్టర్‌లోకి కొత్తగా రూపొందించిన ఇండియా జెర్సీకి త్రివర్ణ పతాకం మరియు 75 సంఖ్య అనేకసార్లు ముద్రించబడి ఉన్న ఫోటోను షేర్ చేసింది.
Also Read: World Most Polluted Cities 2022: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితా.. ఢిల్లీ ఫస్ట్
“ఈ ఫ్లాగ్ ఆఫ్ ది నేషన్, లిమిటెడ్ ఎడిషన్ జెర్సీని ధరించడం ద్వారా భారత స్వాతంత్ర్య 75వ సంవత్సరాన్ని జరుపుకుందాం.’ అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. టీమిండియా జెర్సీ బ్లూ కలర్ లో అదిరిపోయేలా డిజైన్ చేశారు. థిక్ బ్లూలో భారత జాతీయ పతాకం రంగులు కలిసేలా ఒంటిపై తీర్చిదిద్దిన ఈ జెర్సీ ఆకట్టుకుంటోంది. దీన్ని ఆసియాకప్ లో ప్రవేశపెడుతారని భావిస్తున్నారు.
హరారేలో ఆగస్టు 18-22 వరకు జరగనున్న మూడు మ్యాచ్‌ల ODI సిరీస్ కోసం జింబాబ్వేలో భారత జట్టు సభ్యులు ప్రస్తుతం పర్యటిస్తున్నారు. ఆగస్ట్ 27 నుండి యూఏఈలో జరగనున్న ఆసియా కప్ 2022 స్క్వాడ్ సమావేశానికి ముందు మిగిలిన ఆటగాళ్లు ఈ కొంత సమయాన్ని ఆస్వాదిస్తున్నారు.
Also Read: Rajinikanth Governorship: రజనీకాంత్ కు గవర్నర్ గిరి… బీజేపీ స్కెచ్ వెనుక కథా అదా?
https://twitter.com/BCCI/status/1559110145501630465?s=20&t=QMwfZnebuvipM_ZYrk-W2Q
[…] […]
[…] […]