IPL 2024: IPL మొదటి షెడ్యూల్ ను ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. దీంతో అభిమానుల్లో రెండవ షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారోనని ఆత్రుత మొదలైంది. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. మార్చి 22న జరిగే మ్యాచ్ తో 17వ సీజన్ మొదలవుతుంది. తొలి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో బెంగళూరు జట్టు తలపడునుంది. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం మిగతా మ్యాచ్లు జరుగుతాయి. అయితే బీసీసీఐ మొన్నటి షెడ్యూల్లో కేవలం లీగ్ మ్యాచ్ లకు సంబంధించిన వివరాలు మాత్రమే ప్రకటించింది. దానికి కారణం దేశంలో ఎన్నికలు జరుగుతుండటమే. దీంతో సెకండ్ షెడ్యూల్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో అభిమానులకు ఆనందం కలిగించే లాగా సెకండ్ షెడ్యూల్ కు సంబంధించిన ఒక విషయం ఆసక్తికరంగా మారింది.
బీసీసీఐ ఇటీవల విడుదల చేసిన మొదటి షెడ్యూల్ ప్రకారం లీగ్ మ్యాచ్ లు మార్చి 22న ప్రారంభమై ఏప్రిల్ 7న ముగుస్తాయి. కేవలం 21 మ్యాచ్ లు మాత్రమే ఇండియాలో జరుగుతాయి. ఎందుకంటే ఆ తర్వాత దేశంలో ఎన్నికలు ప్రారంభమవుతాయి కాబట్టి.. బీసీసీఐ అప్పటి వరకే షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో సెకండ్ షెడ్యూల్ కు సంబంధించిన మ్యాచులు మొత్తం విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ మదిలో కూడా అదే ఆలోచన ఉంది. సెకండ్ షెడ్యూల్లో భాగంగా మ్యాచ్లను మొత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల కావలసి ఉంది.
ఎన్నికలకు శనివారం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటిస్తున్న నేపథ్యంలో రెండవ దశ ఐపీఎల్ పోటీలపై త్వరలో స్పష్టత ఇచ్చే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోంది. ఒకవేళ విదేశాలలో మ్యాచులు మాత్రం జరిగితే భారత అభిమానులకు అది పెద్ద షాక్. క్రికెట్ అభిమానం ఉన్నవారు ఐపీఎల్ మ్యాచ్ లు విదేశాల్లో నిర్వహిస్తే తీవ్ర అసంతృప్తికి గురవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. పెద్దపెద్ద కార్పొరేటర్లు, వందల కోట్ల వ్యాపారం.. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ రెండవ దశ పోటీలకు ప్రణాళిక రూపొందిస్తోందని తెలుస్తోంది. ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసిన తర్వాత.. బిసిసిఐ రెండవ దశ పోటీలపై స్పష్టతనిచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.