Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్ మీద ఫైర్ అవుతున్న బిసిసిఐ…వన్డేల్లో ఇక డౌటే…

నిజానికి సూర్య టి 20 మ్యాచులు చాలా బాగా ఆడుతాడు కానీ వన్డే మ్యాచులకి వచ్చేసరికి మాత్రం చాలా తడబడుతున్నాడు.ఇక బిసిసిఐ కూడా ఆయన మీద పెట్టుకున్న అంచనాలు అన్ని కూడా ఆయన అందుకోలేకపోతున్నాడు.

Written By: Gopi, Updated On : September 20, 2023 6:22 pm

Suryakumar Yadav

Follow us on

Suryakumar Yadav: ఏషియా కప్ గెలిచిన సందర్భంగా ఇండియా టీం సంబరాలు చేసుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ఆడే మూడు వన్డేలకు బిసిసిఐ రెండు టీం లని సెలెక్ట్ చేసింది. రెండు మ్యాచ్ లకు ఒక టీం ఆడితే, మూడో మ్యాచ్ కోసం సీనియర్ ప్లేయర్లు అందుబాటులోకి వచ్చి వాళ్ళు కూడా ఆ టీం లో ఆడతారు.మొదటి రెండు మ్యాచ్ లకి కెప్టెన్ కె ఎల్ రాహుల్ కాగా, రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. అయితే ఇలా రెండు టీంలను సెలెక్ట్ చేయడం వెనక చాలా పెద్ద విషయాలు దాగివున్నాయి.ఇక ఈ మ్యాచ్ ల్లో కూడా చాలామందికి అవకాశాలు ఇచ్చారు.అలాగే సూర్య కుమార్ యాదవ్ కు కూడా మరో అవకాశం ఇచ్చారు ఇప్పటికీ ఆయనకు చాలా వరకు అవకాశాలు ఇస్తున్నప్పటికీ ఆయన వన్డేల్లో 30 ప్లస్ యావరేజ్ ని కూడా మెయింటేన్ చేయలేకపోతున్నాడు.అయితే ఇప్పుడు ఇచ్చిన అవకాశం తో ఆయనని టీం లో ఉంచాలా లేదా పర్మనెంట్ గా తీసేయాలా అనే చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే అతనికి బ్యాకప్ ప్లేయర్లుగా తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లు ఉన్నారు.

కాబట్టి సూర్య కి ఇక అవకాశాలు ఇవ్వడం కుదరదు బాగా ఆడితే టీం లో ఉంటాడు లేకపోతే టీం నుంచి వెళ్ళిపోతాడు అని బిసిసిఐ స్ట్రాంగ్ గా చెప్పినట్టు గా తెలుస్తుంది. దింతో సూర్య ఆట తీరు మారుతుందా లేక మళ్లీ అదే రకమైన ఆట ఆడుతాడా అనేది ఆయన మీదనే ఆధారపడి ఉంది.నిజానికి సూర్య కి ఇచ్చినన్ని అవకాశాలు వన్డేల్లో మరే ప్లేయర్ కి కూడా ఇవ్వలేదు.ఇక ఇప్పుడు కూడా ప్రూవ్ చేసుకోలేకపోతే సూర్య వన్డే కెరియర్ కూడా ముగిసిపోక తప్పదు. ఇక ఓన్లీ తాను టి 20 మ్యాచులు మాత్రమే ఆడాల్సి ఉంటుంది…

నిజానికి సూర్య టి 20 మ్యాచులు చాలా బాగా ఆడుతాడు కానీ వన్డే మ్యాచులకి వచ్చేసరికి మాత్రం చాలా తడబడుతున్నాడు.ఇక బిసిసిఐ కూడా ఆయన మీద పెట్టుకున్న అంచనాలు అన్ని కూడా ఆయన అందుకోలేకపోతున్నాడు. కాబట్టి ఆయన మీద ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకునే దిశ గా బిసిసిఐ అడుగులు వేస్తున్నట్టు గా తెలుస్తుంది…