BCCI Asia Cup Trophy: ఆసియాకప్ టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. టోర్నీ ముగిసి నెల కావొస్తున్నా ట్రోఫీ మాత్రం భారత్‌కు రాలేదు. పహల్గాం ఉద్రగాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లలో భారత్ నిరసన తెలిపింది. క్రికెటర్లకు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇక ఫైన్‌లో పాకిస్తాన్‌తో తలపడిన భారత్.. దాయాది దేశాన్ని చిత్తు చేసింది. అయితే ట్రోఫీ ప్రదానం ఆసియా కప్ ఇన్‌చార్జి, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ ప్రదానం చేయడంతో భారత జట్టు అతని చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడం ఇష్టం లేక మైదానంలోనే ఉండిపోయింది. దీంతో నఖ్వీ ఆ ట్రోఫీని తీసుకుని పారిపోయాడు. భారత్‌కు చేరాల్సిన ఆ ట్రోఫీ ఇప్పుటికీ భారత్‌కు రాకుండా అడ్డుకుంటున్నాడు.
క్షమాపణలు కోరిన నఖ్వీ..
ఇదిలా ఉంటే.. ట్రోఫీ ఎత్తుకెళ్లడంపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో నఖ్వీ క్షమాపణలు చెప్పాడు. కానీ, ట్రోఫీని ఇప్పటికీ భారత్‌కు అప్పగించలేదు. ఆయన పన్నాగం ప్రకారం బీసీసీఐ ప్రతినిధి లేదా టీమ్ ఇండియా కెప్టెన్ తన వద్దకు రావాలన్న ధోరణి కొనసాగుతోంది. ఈ పద్ధతిని క్రికెట్ వర్గాలు ‘‘పదవి గర్వం’’తో చేసిన నంగనాచి అందంగా వర్ణిస్తున్నాయి.
బీసీసీఐ స్ట్రాటజిక్ కౌంటర్
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఆసియా కప్ నఖ్వీ వ్యక్తిగత ఆస్తి కాదని, విజేతకు ట్రోఫీ ఇవ్వడం అధికారిక విధి అని హెచ్చరించాడు. నఖ్వీ రాజకీయ వ్యాఖ్యలు, మ్యాచ్‌ల సమయంలో ద్వంద్వ నీతులు అభిమానుల ఆగ్రహాన్ని తెప్పించాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నుంచి నఖ్వీని తప్పించే మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోందని పీటీఐ వర్గాలు చెబుతున్నాయి.
ట్రోఫీపై కట్టుదిట్టమైన ఆదేశాలు
ఏసీసీ కార్యాలయంలో ట్రోఫీని నిలిపివేసి, తన అనుమతి లేకుండా ఎవరికి ఇవ్వకూడదని నఖ్వీ తన సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. ప్రెజెంటేషన్‌ను తానే చేసి, భారత జట్టు సారథి లేదా బీసీసీఐకి స్వయంగా అందిస్తానన్న అతని పట్టుదల. ఇది క్రికెట్ డిప్లమసీలో నఖ్వీ అహంకార ఉదాహరణ.
ఈ వివాదం, ట్రోఫీకి సంబంధించి మాత్రమే కాకుండా, ఆసియా క్రికెట్‌లో ఉన్న అధికార–మర్యాదల సున్నిత సమీకరణాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. నఖ్వీ ‘నంగనాచి’ ధోరణి కొనసాగితే, బీసీసీఐ కఠిన అడుగులు వేయడం ఖాయం.