Asia Cup 2023: రోహిత్ శర్మ నేతృత్వంలో ఆసియా కప్ కోసం పాల్గొనబోతున్న భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందరూ ఊహించినట్టే గాయం కారణంగా గత కొద్దికాలం గా మ్యాచులకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్ కు టీమిండియాలో చోటు దక్కింది. తెలుగు తేజం తిలక్ వర్మ కూడా వెస్టిండీస్ పర్యటనలో తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో సెలెక్టర్స్ ను ఆకట్టుకున్నాడు. దీంతో ఆసియా కప్ కోసం ఎంచుకున్న జట్టులో అతనికి కూడా స్థానం లభించింది. టి20 మ్యాచ్ లలో తడబడుతున్న సూర్య కుమార్ యాదవ్ కు కూడా జట్టులో చోటు దక్కింది.
ఆగస్టు చివరలో జరగబోతున్న మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన టీం ఇండియాలో ఎక్కువ శాతం ముంబై ఇండియన్స్ ఉన్నారు. దీంతో ఇది టీం ఇండియా కాదు…టీం MI ఇండియా అని నెటిజెన్స్ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ…ఎంతో చాకచక్యంగా తన జట్టుకు సంబంధించిన ఆటగాళ్లను ఆసియా కప్ టీంలో ఎంపిక అయ్యేవిధంగా చేసుకున్నాడు అని…అతను స్వార్ధపరుడు అనడానికి ఇదొక నిదర్శనమని.. సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.
అయితే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయితే.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా ముంబైకి చెందిన వాడే కదా.. అందుకే ఈసారి జట్టులో ఎక్కువగా ముంబై క్రికెటర్లకు స్థానం కల్పించారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ సారి జట్టులో ముగ్గురు గుజరాత్ ప్లేయర్స్ ఉంటే..
ఆరుగురు ముంబై ఆటగాళ్లు ఉన్నారు.అంటే ఇక దేశం మొత్తం మీద క్రికెటర్లెవరూ లేరా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. తెలుగు కురాడు తిలక్ వర్మ పేరుకు హైదరాబాదీ అయినప్పటికీ అతను కూడా ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ప్లేయర్ కదా.
సూర్యకుమార్ యాదవ్,ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా కూడా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లే.శార్దుల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్ ముంబైకి చెందిన ప్లేయర్స్ . మారో పక్క మాంచి సత్తా ఉన్న ప్లేయర్ శిఖర్ ధావన్‌కు టీం లో ప్లేస్
కల్పించకపోవడం పై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే
సంజూ శాంసన్‌కు మరోసారి అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు.
ఆసియా కప్ కోసం క్రికెట్ సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేసిన ఆటగాళ్లు …రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.