West Indies vs Bangladesh : ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో వెస్టిండీస్ విజయం సాధించింది. అయితే ఆ ఓటమి బంగ్లాదేశ్ జట్టుకు అనేక పాఠాలు నేర్పింది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్ తో జరుగుతున్న టి20 సిరీస్లో అద్భుతమైన ఆరంభాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్ జట్టుతో జరిగిన తొలి t20 మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది.. బంగ్లాదేశ్ బౌలర్ హాసన్ 13 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టి.. ఆ జట్టు సాధించిన విజయంలో కీలకపాత్ర పోషించాడు.. వెస్టిండీస్, బంగ్లాదేశ్ పరస్పరం t20 మ్యాచ్లలో తలపడిన ప్రతిసారీ.. వెస్టిండీస్ గెలుపు ను సొంతం చేసుకునేది. అయితే తొలిసారిగా బంగ్లాదేశ్ వెస్టిండీస్ జట్టు పై t20 మ్యాచ్లో విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపు పతాకాన్ని ఎగరవేసింది. ఆర్నోస్ వెల్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. బంగ్లాదేశ్ ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి 147 రన్స్ చేసింది. అయితే 148 రన్ టార్గెట్ తో రంగంలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 19.5 ఓవర్లకు ఆల్ అవుట్ అయింది. కెప్టెన్ పావెల్ మెరుగ్గా బ్యాటింగ్ చేసినప్పటికీ.. అతడికి సరైన సహకారం లభించకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. 35 బంతులు ఎదుర్కొన్న అతడు 60 పరుగులు చేశాడు. అయినప్పటికీ వెస్టిండీస్ ఓడిపోక తప్పలేదు.
హసన్ కీలక పాత్ర
బంగ్లాదేశ్ విజయంలో ఆ జట్టు బౌలర్ హసన్ కీలకపాత్ర పోషించాడు. వాస్తవానికి ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఇన్నింగ్స్ సమయంలో.. 17 ఓవర్ల దాకా మ్యాచ్ మొత్తం వెస్టిండీస్ చేతిలో ఉంది. అయితే చివరి 3 ఓవర్లలో బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా వెస్టిండీస్ జట్టుకు తొలిసారి ఇవ్వటమని అందించారు. 18 ఓవర్లో వెస్టిండీస్ జట్టు 8 వ వికెట్ కోల్పోయింది. ఆ ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే లభించాయి. చివరి రెండు ఓవర్లలో వెస్టిండీస్ జట్టు విజయానికి 18 పరుగులు కావాల్సి ఉంది. 19 ఓవర్లో కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి ఓవర్లో వెస్టిండీస్ విజయానికి 10 పరుగులు అవసరం ఉన్నచోట.. హసన్ అద్భుతం చేశాడు. ఆ ఓవర్ మూడో బంతికి పావెల్, ఐదో బంతికి జోసెఫ్ వికెట్లను పడగొట్టి బంగ్లాదేశ్ చెట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. తస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. రిషాద్ హుస్సేన్, హసీన్ సాకీబ్ చెరో వికెట్ సొంతం చేసుకున్నారు. హసన్ నాలుగు ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి.. నాలుగు వికెట్లు పడగొట్టాడు. టి20 కెరియర్ లో అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. తద్వారా తన బౌలింగ్ ప్రతిభతో బంగ్లాదేశ్ జట్టుకు వెస్టిండీస్ పై తొలి టి20 విజయాన్ని అందించాడు.