Bangladesh vs Sri Lanka : ఒకే ఓవర్ లో 0-W-W-W-0-0.. బౌలర్ అరుదైన రికార్డు.. సిరీస్ ఆ జట్టు సొంతం

టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 18 పరుగులకు ధనుంజయ డిసిల్వా (8) రూపంలో తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక జట్టు, 52 పరుగుల వద్ద కుమిండ్ మెండిస్ (12) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కుషాల్ మెండిస్ (55 బంతుల్లో ఆరు ఫోర్లు, 6 సిక్సర్లు 86) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో శ్రీలంక జట్టు 7 వికెట్ల కోల్పోయి 174 పరుగులు చేసింది.. మెండిస్ మినహా మిగతా వారెవరూ రాణించలేదు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్, హోసైన్ తలా రెండు వికెట్లు తీశారు. ముస్తాఫిజుర్, ఇస్లాం తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

Written By: NARESH, Updated On : March 9, 2024 8:52 pm
Follow us on

Bangladesh vs Sri Lanka : బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న టి20 మ్యాచ్లో శ్రీలంక బౌలర్ అద్భుతం సృష్టించాడు. శనివారం బంగ్లాదేశ్ వేదికగా జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో లంక పేస్ బౌలర్ నువాన్ తుషారా సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఒకే ఓవర్ లో హ్యాట్రిక్ వికెట్లు సాధించి ఆకట్టుకున్నాడు. పైగా ఆ ఓవర్ ను మేడిన్ గా వేశాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సందర్భంగా తుషారా మూడో ఓవర్ వేశాడు. ముందుగా వేసిన బంతి వికెట్ల పైకి రావడంతో బంగ్లాదేశ్ బ్యాటర్ షాంటో పరుగులు ఏమి తీయలేదు. ఆ తర్వాత బంతిని కూడా తుషారా అలాగే వేయడంతో శాంటో అంచనా వేయలేకపోయాడు. దీంతో ఆ బంతి వికెట్లను తాకింది. ఫలితంగా బంగ్లాదేశ్ జట్టు 15 పరుగులకు శాంటో రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం తుషారా వేసిన మూడో బంతికి మహమ్మదుల్లా వికెట్ల మందు దొరికిపోయాడు. మరుసటి బంతికి హృదోయ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇలా ముగ్గురు కీలకమైన బ్యాటర్లు వరుస బంతుల్లో అయ్యారు. ఆ ఓవర్ లో మిగతా మూడు బంతులకు పరుగులేవి ఇవ్వకుండా తుషారా సంధించడంతో మేడిన్ గా మారింది.

టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 18 పరుగులకు ధనుంజయ డిసిల్వా (8) రూపంలో తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక జట్టు, 52 పరుగుల వద్ద కుమిండ్ మెండిస్ (12) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కుషాల్ మెండిస్ (55 బంతుల్లో ఆరు ఫోర్లు, 6 సిక్సర్లు 86) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో శ్రీలంక జట్టు 7 వికెట్ల కోల్పోయి 174 పరుగులు చేసింది.. మెండిస్ మినహా మిగతా వారెవరూ రాణించలేదు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్, హోసైన్ తలా రెండు వికెట్లు తీశారు. ముస్తాఫిజుర్, ఇస్లాం తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం 175 పరుగుల టార్గెట్ తో చేజింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు 19.4 ఓవర్లలో 146 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో రిషద్ హోసైన్(53), అహ్మద్ (31) మాత్రమే రాణించారు. 32 పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ జట్టును హోసైన్(53), అహ్మద్ (31) ఆదుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. 3 టి20 ల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ శ్రీలంక గెలవగా, రెండవ మ్యాచ్ బంగ్లాదేశ్ గెలిచింది. కీలకమైన మూడో మ్యాచ్లో శ్రీలంక అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపించడంతో బంగ్లాదేశ్ ఓడిపోయింది. ఫలితంగా సిరీస్ శ్రీలంక దక్కించుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా తుషార, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా కుశాల్ మెండిస్ ఎంపికయ్యారు.