Bangalore Team : ఆ తర్వాత 209 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన బెంగళూరు 200 పరుగుల వద్ద ఆగిపోయింది. నాటి మ్యాచ్లో కన్నడ జట్టు ప్రారంభకులు గేల్, విరాట్ కోహ్లీ శతక పునాదిని తొలి వికెట్ కోసం నమోదు చేసినప్పటికీ.. ఆ తర్వాత హైదరాబాద్ బౌలర్లు రెచ్చిపోవడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. 2016 కంటే రెండుసార్లు బెంగళూరు ఫైనల్ వెళ్ళింది. ఆ రెండుసార్లు ఓటమిపాలైంది. ఇక 2016 లోనూ బెంగళూరు ఓడిపోవడంతో.. మూడుసార్లు ఫైనల్లో ఓడిపోయి కప్ లేకుండా ఇంటికి వెళ్లిన జట్టుగా బెంగళూరు నిలిచింది.
ఇక 2016 తర్వాత దాదాపు ఎన్ని సంవత్సరాలు వరకు బెంగళూరు ఫైనల్ వెళ్లలేదు. అయితే 2025 లో మాత్రం అద్భుతం జరిగింది. సెమీ ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ జట్టుపై ఏకంగా 8 వికెట్ల వ్యత్యాసంతో బెంగళూరు విజయం సాధించింది. పంజాబ్ జట్టుకు సొంతమైదానం అయినప్పటికీ.. బెంగళూరు ఆ పిచ్ మొత్తాన్ని అర్థం చేసుకుంది. తొలి అంచెలో.. అద్భుతంగా బౌలింగ్ వేసి.. పంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది.. ఏమాత్రం భారీ పరుగులు చేసే అవకాశం ఇవ్వకుండా మాయాజాలం ప్రదర్శించింది.. భీకరమైన ఫామ్ లో ఉన్న ఓపెనర్లను వెంటవెంటనే పెబిలియన్ పంపించింది. వన్ డౌన్ ప్లేయర్, మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లను వెనక్కి పంపించి కోలుకోలేని దెబ్బతీసింది.
Also Read : బౌలింగ్ మొదలుపెట్టిన బుమ్రా.. MI లో ఎంట్రీ అప్పుడే.
2016లో మే 29న జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన బెంగళూరు.. సరిగ్గా తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తర్వాత అదే తేదీన ఐపీఎల్ ఫైనల్ కు అర్హత సాధించడం విశేషం..” దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఇక్కడి దాకా వచ్చాం. ఈసారి దేవుడు మాకు అనుకూలంగా ఉన్నాడు. మాకు సపోర్ట్ గానే స్క్రిప్ట్ కూడా రాశాడు. అందువల్లే మేము ఫైనల్ దాకా వచ్చాం. కచ్చితంగా విజయం సాధిస్తాం. కప్ అందుకుంటాం. 18 సంవత్సరాల నిరీక్షణకు తెర దించుతాం. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఆటగాళ్లు జట్టు కోసం అద్భుతంగా కష్టపడుతున్నారు. తీవ్రంగా పాటుపడి విజయం సాధించేలా చేస్తున్నారు. వారందరికీ రుణపడి ఉంటామని” బెంగళూరు అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
బెంగళూరు విజయం సాధించిన తర్వాత అభిమానుల సంబరాలు ఆకాశమే హద్దుగా సాగుతున్నాయి.. ఫైనల్ చేరడమే ఆలస్యం బెంగళూరు అభిమానులు ఒక్కసారిగా రెచ్చిపోయారు.. బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.. ఈసాలా కప్ నమదే అంటూ నినాదాలు చేస్తున్నారు. వారి ఆనందానికి అవధి అనేది లేకుండా పోయింది.. అసలు బెంగళూరు అభిమానులు ఆ ఆనందాన్ని తట్టుకోలేక.. జీవితం ధన్యమైందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఫైనల్ మ్యాచ్లో భీకరమైన ఆట తీరు ప్రదర్శించి.. ట్రోఫీని తమ రాష్ట్రానికి తేవాలని కన్నడ అభిమానులు కోరుకుంటున్నారు.