Axar Patel: సౌత్ ఆఫ్రికా జరుగుతున్న 5 t20 మ్యాచ్ల సిరీస్లో టీమ్ ఇండియాకు షాక్ తగిలింది. ఇప్పటికే టీమిండియా రెండు మ్యాచ్లు గెలిచింది. సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ గెలిచింది. ఈ సిరీస్ లో నాలుగో మ్యాచ్ బుధవారం జరుగుతుంది. ఐదో మ్యాచ్ ఈనెల 19న జరుగుతుంది.
నాలుగో మ్యాచ్ కు టీమిడియాకు షాక్ తగిలింది. టీమిండియా స్టార్ స్పిన్నర్, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ మిగతా రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. అతడు అనారోగ్యానికి గురి కావడంతో రెండు మ్యాచ్లకు దూరమైనట్టు బిసిసిఐ ప్రకటించింది. అతడి స్థానంలో షాబాజ్ అహ్మద్ ను తీసుకున్నట్టు ప్రకటించింది. షాబాజ్ అహ్మద్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. ముఖ్యంగా స్లాగ్ ఓవర్లలో దుమ్ము లేపగలడు. అందువల్లే అతడికి జట్టులో స్థానం కల్పించారు.
ఈ సిరీస్ లో అక్షర్ పటేల్ అదరగొట్టాడు. కీలక సమయంలో వికెట్లు సాధించాడు. బ్యాట్ ద్వారా కూడా సమయోచితమైన ఇన్నింగ్స్ ఆడాడు. అందువల్లే అతడిని రెండవ మ్యాచ్లో మూడో స్థానంలో బ్యాటింగ్ కు పంపించారు. రెండో మ్యాచ్లో టీమిండియా టాప్ ఆర్డర్ విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. ప్రస్తుతం అక్షర్ పటేల్ అనారోగ్యానికి గురి కావడంతో అతనికి విశ్రాంతి ఇచ్చారు. న్యూజిలాండ్ జట్టుతో జరిగే టీ20 సిరీస్ లో అతడికి అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. న్యూజిలాండ్ జట్టుతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత.. స్వదేశం వేదికగా టి20 వరల్డ్ కప్ మొదలవుతుంది.
2024 సీజన్లో టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించింది. అంతకంటే ముందు 2007లో ధోని ఆధ్వర్యంలో టీమిండియా పొట్టి ప్రపంచ కప్ అందుకుంది. 2024లో టి20 వరల్డ్ కప్ అందుకున్న టీమిండియా..2026 లో కూడా అదే మ్యాజిక్ ప్రదర్శించాలని భావిస్తోంది. ఇప్పటికే కీలకమైన బుమ్రా కు మేనేజ్మెంట్ మూడో మ్యాచ్లో విశ్రాంతి ఇచ్చింది. వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్ వంటి ప్లేయర్లను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసింది. న్యూజిలాండ్ సిరీస్ లో వీరికి అవకాశం కల్పించి. వారు ఆడే తీరు ఆధారంగా టి20 వరల్డ్ కప్ లో చోటు ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.