https://oktelugu.com/

ఆస్ట్రేలియా సిరీస్: రోహిత్ ను భర్తీ చేసేదెవరు?

పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ శర్మ భారత్ కు వెన్నెముక లాంటి వాడు. అయితే రోహిత్ గాయం కారణంగా త్వరలో జరిగే   ఆస్ర్టేలియా పరిమిత ఓవర్ల సీరిస్ కు దూరమయ్యాడు. దీంతో శిఖర్ ధావన్ కు జతగా ఓపెనర్ గా బరిలో నిలుస్తారో తెలియండం  లేదు. అయితే ప్రతిభవంతులు రేసులో ఉన్నారు. వారెవరో చూద్దాం… Also Read: కోహ్లీతో ఫైట్ కు రోహిత్ శర్మ రెడీ అయ్యాడా? కేఎల్ రాహుల్ పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడిని […]

Written By:
  • NARESH
  • , Updated On : November 22, 2020 / 11:52 AM IST
    Follow us on

    పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ శర్మ భారత్ కు వెన్నెముక లాంటి వాడు. అయితే రోహిత్ గాయం కారణంగా త్వరలో జరిగే   ఆస్ర్టేలియా పరిమిత ఓవర్ల సీరిస్ కు దూరమయ్యాడు. దీంతో శిఖర్ ధావన్ కు జతగా ఓపెనర్ గా బరిలో నిలుస్తారో తెలియండం  లేదు. అయితే ప్రతిభవంతులు రేసులో ఉన్నారు. వారెవరో చూద్దాం…

    Also Read: కోహ్లీతో ఫైట్ కు రోహిత్ శర్మ రెడీ అయ్యాడా?

    కేఎల్ రాహుల్ పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడిని మించిన వాడు లేడు. తనకు ఏ పాత్ర ఇచ్చిన సక్రమంగా నిర్వహించడంలో దిట్టా. ఓపెనర్ గా, మిడిలార్డర్ లో, వికెట్ కీపర్ గా అద్భుతంగా రాణించాడు. త్వరలో జరిగే ఆస్ర్టేలియా సీరిస్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికైయ్యాడు. ఐపీఎల్ ఓపెనర్ గా రాణించి ఆరెంజ్ టోపీని అందుకున్నాడు. రోహిత్ స్థానాన్ని భర్తీ చేసే రేసులో అందరికంటే ముందువరుసలో ఉన్నాడు.

    అలాగే శుభ్ మన్ గిల్ అవకాశం ఉంది. అద్భతమైన టెక్నిక్ గల శుభ్ మన్ ఐపీఎల్ కోల్ కతా తరఫున ఓపెనర్ దిగి రాణించాడు. గతేడాది న్యూజిలాండ్ పై వడ్డే అరంగేట్రం చేసిన గిల్  రాణించలేదు. కానీ ఐపీఎల్ మళ్లీ ఫామ్ అందుకొని సత్తచాటాడు. మరి ఆస్ర్టేలియా సీరీస్ కు లో గిల్ ఎలా రాణిస్తాడో చూడాలి.

    Also Read: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా.. ఇద్దరు కీలక బౌలర్లుకు రెస్ట్ ఇచ్చిన బీసీసీఐ.. ఎందుకు?

    టెస్టుల్లో ఓపెనర్ గా సత్తా చాటిన మయాంక్ అగర్వాల్. ఇప్పుడు పరిమిత క్రీకెట్లో రాణిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కింగ్స్ ఎలెవన్ తరఫున ఓపెనర్ అద్భతంగా రాణించాడు మయాంక్. మంచి ఫామ్ లో ఉన్న మయంక్ పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటేందుకు ఉత్సహంతో ఉన్నాడు.

    అలాగే సంజు శాంసన్ కూడా పోటిదారుడే  ఇటీవల ఐపీఎల్ రాణించాడు. హిట్టింగ్ సామర్థం ఉన్న శాంసన్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేయగలడు. వన్డేల్లో ఇంకా అరంగేట్రం చేయలేదు. రోహిత్ లేని నేపథ్యంలో రాణించాలని చూస్తున్నాడు శాంసన్