Homeక్రీడలుక్రికెట్‌Australia T20 World Cup 2026: తల పొగరు నెత్తికెక్కితే.. ఇదిగో ఇలానే ఉంటుంది.. ఆస్ట్రేలియా...

Australia T20 World Cup 2026: తల పొగరు నెత్తికెక్కితే.. ఇదిగో ఇలానే ఉంటుంది.. ఆస్ట్రేలియా అనుభవిస్తోంది!

Australia T20 World Cup 2026: 2023లో టీమ్ ఇండియా మీద వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచింది. టీమిండియా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలవడం అప్పట్లో సంచలనం కలిగించింది…

టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్లు వరల్డ్ కప్ మీద కాలు పెట్టి ఫోటో లు దిగారు. అప్పట్లో ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అప్పట్లో కొంతమంది ఆస్ట్రేలియా ప్లేయర్లు వ్యవహరించిన తీరును తీవ్రంగా విమర్శించారు…

2023లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో విజయం సాధించింది. ఆ తర్వాత ఐసీసీ నిర్వహించిన ఏ మేజర్ టోర్నీలో కూడా విజేతగా నిలవలేకపోయింది.

2024 t20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయింది. భారత్ చేతుల్లో కూడా ఓటమిపాలైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా టీమ్ ఇండియా చేతిలో ఓటమిపాలైంది. ఇది మాత్రమే కాదు పాకిస్తాన్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, టీమిండియా చేతుల్లో వన్డే సిరీస్ లు కోల్పోయింది ఆస్ట్రేలియా.

గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. టి20 వరల్డ్ కప్ లో ప్రస్తుతం జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా ఒకప్పుడు క్రికెట్ మొత్తాన్ని శాసించింది. ఐసీసీ నిర్వహించిన ప్రతి టోర్నీ లోను సత్తా చూపించింది. ఆస్ట్రేలియా దూకుడు ముందు అన్ని జట్లు తలవంచేవి.

గతం ఎంతో ఘనం అన్నట్టుగా ఇప్పుడు ఆస్ట్రేలియా పరిస్థితి మారిపోయింది. చిన్న చిన్న జట్ల చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నాడు వన్డే వరల్డ్ కప్ మీద కాళ్లు పెట్టి ఆస్ట్రేలియా ప్లేయర్లు ఫోటోలు దిగడం వల్లే ఇంతటి దుస్థితి దాపురించిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆస్ట్రేలియా తల పొగరు తగ్గించుకోవాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. “ఒకప్పుడు ప్రత్యర్థి ప్లేయర్లను దూషించేవారు. ఆ తర్వాత తల పొగరు ను ఒంట పట్టించుకున్నారు. ఇప్పుడేమో తగిన ఫలితాన్ని అనుభవిస్తున్నారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది. అది ఆస్ట్రేలియాకు ఇప్పుడు వాస్తవంలో కనిపిస్తోందని” క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
Oktelugu Epaper
Exit mobile version