Australia playing 11 : Australia Cricket Teamఅయితే ఇప్పుడు తన ప్రత్యర్థి సఫారీ జట్టు. బుధవారం నుంచి జరగబోయే ఈ ప్రఖ్యాత ఫైనల్ కోసం కంగారు జట్టు రెడీ అయింది. ఏమాత్రం భయం లేకుండా.. ఒత్తిడి అసలు లేకుండా రంగంలోకి దిగింది. అంతేకాదు ప్లేయింగ్ -11 లో ఈసారి భీకరమైన మార్పులు చేసింది.. పేస్, బలమైన బ్యాటింగ్, అద్భుతమైన ఫీల్డింగ్ లైన్ అప్ తో సఫారి జట్టు మీద దాడి చేసేందుకు సిద్ధమైంది. గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా అదరగొట్టాలని ఒక అంచనాకొచ్చింది. అంతేకాదు సుదీర్ఘ ఫార్మాట్ లో తన పట్టును మరింత గట్టిగా నిలుపుకునేందుకు అడుగులు వేస్తోంది.
అత్యంత ప్రతిష్టత్మకమైన లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో సత్తా చూపించాలని కంగారు జట్టు భావిస్తోంది. సఫారి జట్టుతో జరిగే కీలకమైన పోరులో అదరగొట్టాలని అంచనాలు వేసుకుంటున్నది. అంతేకాదు వరుసగా రెండవ సీజన్లో సైతం డబ్ల్యూటీసీ విజేతగా నిలవాలని భావిస్తున్నది.. మరోవైపు సఫారి జట్టు కూడా ఈసారి ఫైనల్ వచ్చిన నేపథ్యంలో.. అదరగొట్టాలని అర్చనతో ఉంది.. ఇక కంగారు జట్టు కెప్టెన్ కమిన్స్ తన బృందాన్ని వెల్లడించాడు. మంగళవారం లండన్లో మీడియాతో మాట్లాడుతూ.. తన జట్టు వివరాలను బయటపెట్టాడు. అయితే కంగారు జట్టు లెజెండ్ క్రికెటర్ పాంటింగ్ మేలో ఐసీసీ రివ్యూలో అంచనా వేసినట్టుగానే ఈ జట్టు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
లబూ షేన్ మొదలుపెడతాడు..
కంగారు జట్టు తరఫున గతంలో సుదీర్ఘ ఫార్మాట్లో మొదటి స్థానంలో ఉన్న లబూ షేన్.. ఖవాజా తో కలిసి కంగారు జట్టు ఇన్నింగ్స్ మొదలు పెడతాడు. గ్రీన్ మూడో స్థానంలో ఎంట్రీ ఇస్తాడు.. ఇటీవల కాలంలో అతడు వెన్నునొప్పితో బాధపడుతూ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. చాలాకాలం తర్వాత చెట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడి రాకతో బ్యాటింగ్, బౌలింగ్ విభాగం బలంగా మారింది.. ఇక బోలాండ్ ను పక్కకు నెట్టి హేజిల్ వుడ్ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. మిచెల్ స్టార్క్, కమిన్స్ తో కలిసి హేజిల్ వుడ్ పేస్ విభాగంలో కీలకంగా ఉంటాడు. ఇక ఈ మైదానంలో వుడ్ రికార్డు గొప్పగా ఉంది.. ఇక వీరితోపాటు వెబ్ స్టర్ కు కూడా తుది జట్టులో స్థానం లభించింది.. ఇతడు ఆల్రౌండర్ గా ఉన్నాడు.. స్మిత్, హెడ్ బ్యాటింగ్లో మధ్య విభాగాన్ని మోస్తారు.. క్యారీ వికెట్ కీపర్ గా కొనసాగుతాడు.. స్పిన్ విభాగం లయన్ పైనే ఆధారపడి ఉంది. ప్రధాన స్పిన్నర్ గా లయన్ ఉన్నాడు.
తుది జట్టు ఇదే (అంచనా)
ఖవాజా, లబూ షేన్, స్మిత్, గ్రీన్, వెబ్ స్టర్, హెడ్, స్టార్క్, కమిన్స్, క్యారీ, లయన్, హేజిల్ వుడ్.