Asia Cup 2023: వన్డే ప్రపంచ కప్ కోసం బాగా సన్నద్ధం కావడానికి.. టీమ్ల యొక్క బలాబలాలను పరీక్షించుకోవడానికి ఆసియా కప్ ఉపయోగపడుతుంది అని భావించిన టీమిండియా ప్రస్తుతం ఏం చేయాలో తెలియని స్థితిలో తలమునకలై ఉంది. పర్ఫామెన్స్ సంగతి దేవుడెరుగు మ్యాచ్ జరిగితే చాలు అన్నట్టుగా వరుణుడు తెగ కలవర పెడుతున్నాడు.
టీమిండియా ప్రణాళికను అన్ని వాన దెబ్బతీసేలా కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ జరగడానికి వేదికగా శ్రీలంకను ఎంచుకోవడం బీసీసీఐ చేసిన పెద్ద తప్పేమో అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రపంచ కప్ లో పాల్గొనడానికి గాయాల నుంచి కోలుకొని మరి టీంలో జాయిన్ అయినా ఆటగాళ్లకు ఎక్స్పీరియన్స్ బాగా పనికి వస్తుంది అనుకుంటే ఇలా అయింది ఏంటబ్బా అని టీమిండియా కోచ్ కలవర పడుతున్నాడు.
ఈ ఆటలో వాళ్ళ పర్ఫామెన్స్ ని పట్టే రాబోయే ప్రపంచ కప్ కోసం వాళ్ళు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు అన్న విషయంపై పూర్తి అవగాహన వస్తుంది. అలాగే జట్టు కూర్పుపై…చేయవలసిన జాగ్రత్తలు మరియు ప్రణాళికలపై ఒక అంచనా వేసుకోవచ్చు. అనుకున్నది ఒక్కటి .. తీరా అక్కడికి వెళ్లాక జరుగుతున్నది ఒకటి అన్నట్టు ఉంది టీమిండియా పరిస్థితి.
సరిగ్గా మంచి మ్యాచ్ టైం లేకపోవడంతో రోహిత్ సేన తమ ప్రాక్టీస్ పై.. పర్ఫామెన్స్ పై పూర్తిస్థాయి ఫోకస్ చేయలేకపోతోంది. ఎంతో ఆసక్తిగా అందరూ ఎదురు చూసిన భారత్ పాక్ మ్యాచ్ వర్షం కారణంగా నిరాశ మిగిల్చింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి పునరాగమనం చేసిన బుమ్రా చేతికి బంతి వెళ్లిన దాకలే లేదు. ఇప్పటివరకు అతను ఒక్క వండే మ్యాచ్లో కూడా ఇంకా బౌలింగ్ చేయలేదు.. మొన్న జరిగిన నేపాల్ మ్యాచ్లో కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల పాల్గొనలేకపోయాడు. అన్నీ కుదిరి పాల్గొన్న మ్యాచులలో వాన కారణంగా ఆడ లేకపోయాడు. ఇక అతని ఫిట్నెస్ ఏ రేంజ్ లో ఉందో …అన్నది ప్రశ్నార్థకం.
నేపాల్తో ఆడిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా నామమాత్రంగా సాగింది. పల్లెకెలెలో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ల పరిస్థితి ఇదే. మరి ఈ నేపథ్యంలో రేపు సెప్టెంబర్ 17న జరగబోయే ఫైనల్ మ్యాచ్ కి వేదిక పల్లెకెలె కావడం తో…ఫైనల్స్ ఎలా జరుగుతాయి అన్న అనుమానాలు ఇప్పటినుంచే మొదలయ్యాయి. గత రెండు వారాలుగా కొలంబోలో ఆగకుండా భారీ వర్షాలు కుడుస్తున్నాయి. ఈ విషయం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగిస్తుంది.
ఇది చాలదన్నట్టు రేపు ఆదివారం జరగబోయే భారత్ ..పాకిస్తాన్ సూపర్ ఫోర్ మ్యాచ్ కు వర్షం ముప్పు తప్పేలా కనిపించడం లేదు. వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం ఆరోజు 75% వాన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఎలా సాగుతుంది అన్న విషయంపై ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో పలు రకాల మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు వర్షాల కారణంగా ప్రస్తుతం కొలంబోలో టీమ్ ఇండియా ప్రాక్టీస్ కేవలం ఇండోర్ కే పరిమితం అయింది. గురువారం నాడు కూడా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సమక్షంలో భారత్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు.
అయితే వర్షాల కారణంగా సూపర్ ఫోర్ మ్యాచుల వేదికను హంబన్టకు
మార్చాలని శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ (ఎస్ఎల్సీ) ప్రతిపాదికను ఆసియా క్రికెట్ కౌన్సిల్ తోసి పుచ్చింది. ఇంత తక్కువ వ్యవధిలో అన్ని వసతులు, సామగ్రి, సిబ్బంది సమకూర్చడం కష్టమని వారి వాదన. మరి ఇక మ్యాచ్ పరిస్థితి ఏమిటి అనేది వరుణ దేవుడికే తెలియాలి..