Pakistan Vs India: టీమిండియా ఆసియా కప్ మరోసారి దక్కించుకుంది. వరుసగా రెండు సీజన్లలో విజేతగా నిలిచి అదరగొట్టింది. తీవ్ర ఉత్కంఠ మధ్య.. తీవ్ర ఒత్తిడి మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తద్వారా ఆసియాలో క్రికెట్ రారాజుగా మరోసారి తన స్థాయిని పెంచుకుంది. భారత జట్టు పాక్ పై అద్భుతమైన విజయాన్ని సాధించిన తర్వాత ఆటగాళ్లు ఊహించని విధంగా వేడుకలను జరుపుకున్నారు. సాధారణంగా ఏదైనా క్రికెట్ జట్టు ట్రోఫీ గెలుచుకుంటే.. సంబరాలు జరుపుకుంటుంది. ట్రోఫీ అందుకొని కేరింతలు కొడుతుంది. కానీ టీమ్ ఇండియా ప్లేయర్లు అలా చేయలేదు. విజయం సాధించిన వెంటనే మైదానంలో చాలాసేపు వరకు ఉత్కంఠ కొనసాగింది. ఆసియా టికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకుంటుందా? లేదా? అనే ఉత్కంఠ అందరిలోనూ కలిగింది. దాదాపు గంట సేపు వరకు మైదానంలో అదే పరిస్థితి కొనసాగింది. చివరికి టీమిండియా ప్లేయర్లు ట్రోఫీ అందుకునే విషయంలో క్లారిటీ ఇచ్చారు.
ఫైనల్ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ కెప్టెన్ తో కలిసి ఫోటోషూట్ లో పాల్గొనడానికి టీమ్ ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆసక్తి చూపించలేదు. అంతేకాదు తను ఒక్కడు మాత్రమే ఫోటో దిగాడు. అంతేకాదు కనీసం పాకిస్తాన్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. మైదానంలో ఏ ఒక్క పాకిస్తాన్ ఆటగాడితో టీమిండియా ప్లేయర్లు మాట వరసకు కూడా మాట్లాడలేదు. చివరికి విజయం సాధించిన తర్వాత కూడా నఖ్వీ నుంచి ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా సారధి ఆసక్తి చూపించలేదు. టీమిండియా ప్లేయర్లు ట్రోఫీ ఆదుకోవడానికి ఇష్టపడకపోవడంతో ఏసియన్ క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నఖ్వీ వెనక్కి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ట్రోఫీ పట్టుకొని విచారణ వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆ తర్వాత భారత ప్లేయర్లు పోడియం వద్దకు చేరుకొని కప్ లేకుండానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. పాక్ ఆటగాళ్లు రన్నరప్ చెక్, మెడల్స్ తీసుకున్నారు. భారత ఆటగాళ్లు అవి కూడా తీసుకోలేదు.
అందువల్లే..
నఖ్వీ మొదటినుంచి కూడా భారత క్రికెట్ బోర్డు కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు.. ఇటీవల మైదానంలో చిల్లర వేషాలు వేసిన ఫర్హాన్, రౌఫ్ వెనుక అతడు ఉన్నాడని తెలుస్తోంది. ఐసీసీ వారికి విధించిన అపరాధ రుసుము ను కూడా అతడే చెల్లించడానికి ముందుకు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కూడా భారత జట్టు పై నోరు పారేసుకున్నాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఛాంపియన్ ట్రోఫీ ప్రదర్శించడానికి ఉత్సాహం చూపించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశానికి, భారత క్రికెట్ జట్టుకు వ్యతిరేకంగా నఖ్వీ అనేక ప్రయత్నాలు చేశాడు కాబట్టి.. సూర్య కుమార్ యాదవ్ అతడి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి ఇష్టపడలేదు.. ఒకరకంగా పహల్గాం నిరసనను భారత్ ఇలా వ్యక్తం చేసిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.