Asia Cup 2025 Pakistan Vs India Super 4: వారం వ్యవధిలోనే పాకిస్తాన్ భారత్ తలపడబోతున్నాయి. ఆసియా కప్ లో భాగంగా ఆదివారం జరిగే సూపర్ 4 మ్యాచ్లో ఈ రెండు జట్లు పోటీ పడబోతున్నాయి. ఫేవరెట్ భారత జట్టు అయినప్పటికీ.. పాకిస్తాన్ జట్టును అంత తేలికగా తీసి పారేయడానికి లేదు. పైగా షేక్ హ్యాండ్ వివాదం తర్వాత ఆ జట్టు ప్రతీకారంతో రగిలిపోతోంది. ఇలాంటి సమయంలో ఆ జట్టుకు మరో పంచ్ కనుక ఇస్తే నోరు మూసుకొని మూలకు కూర్చుంటుంది. అదివారం జరిగే మ్యాచ్లో భారత మరోసారి తన శక్తి యుక్తులను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత్ తన పూర్తిస్థాయి ఆట తీరు ప్రదర్శించలేదు. తొలి రెండు ఓవర్లలో ఆరు పరుగులు మాత్రమే చేసి.. కీలకమైన గిల్ వికెట్ కోల్పోయింది.
ఒమన్ జట్టు మీద భారత్ చేసిన ప్రదర్శన ఏమాత్రం గొప్పగా లేదు. పరుగుల వరద పారుతుంది.. రికార్డులు బద్దలవుతాయి అనుకుంటే.. కేవలం 188 పరుగులు మాత్రమే భారత జట్టు చేసింది. ఇక చేజింగ్ లోనూ ప్రత్యర్థి జట్టు దుమ్మురేపింది. ఒకరకంగా ఇది భారత జట్టు ఊహించంది. ఒమన్ పోరాటం తర్వాత పాకిస్తాన్ జట్టు మీద విమర్శలు పెరిగిపోయాయి. బహుశా ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు భారత జట్టులో వైస్ కెప్టెన్ గిల్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. సంజు ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అదరగొట్టాడు. అభిషేక్ శర్మ దుమ్ము రేపు తున్నాడు. హార్దిక్ పాండ్యా, శివం దుబే, తిలక్ వర్మ నుంచి భారీ ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. మరోవైపు బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు కాబట్టి తిరుగులేదు.
మరోవైపు పాకిస్తాన్ ఎప్పటిలాగే తన బౌలింగ్ ను నమ్ముకుంది. షహీన్ ఆఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఆయూబ్ మ్యాజిక్ చేస్తారని గంపెడు ఆశలు పెట్టుకుంది. ఇటీవల భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆయుబ్ మూడు వికెట్ల తీశాడు. బలమైన భారత బ్యాటింగ్ లైన్ అప్ కు అడ్డుకట్ట వేస్తేనే పాకిస్తాన్ జట్టుకు ఆశలు ఉంటాయి. మరోవైపు ఇటీవల యూఏఈ తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చివర్లో షాహిన్ ఆఫ్రిది అదరగొట్టాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఫలితం వచ్చేది. సల్మాన్ ఆఘా, ఫర్హాన్ నుంచి పాకిస్తాన్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. షేక్ హ్యాండ్ వివాదం తర్వాత ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో పోరు హోరాహోరీగా సాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.