Ashleigh Barty: World number one makes shock call to quit tennis: 3 సార్లు గ్రాండ్ స్లామ్ గెలిచి.. ప్రస్తుతం ప్రపంచ నంబర్ 1 గా ఉన్న క్రీడాకారిణి ఆష్లీ బార్టీ సడెన్ గా రిటైర్ మెుంట్ ప్రకటించడం సంచలనమైంది. ఆయన వయసు కూడా ఏమీ అయిపోయలేదు. కేవలం 25 ఏళ్లకే ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించి క్రీడా ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియన్ టెన్నిస్ సంచలనం బుధవారం సోషల్ మీడియాలో తన రిటైర్ మెంట్ ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేసింది. టెన్నిస్ వదిలేసి తన ఇతర కలలను నెరవేర్చుకునేందుకు వెళుతున్నట్టు పేర్కొంది.

‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే రిటైర్ మెంట్ కు సిద్ధంగా ఉన్నా.. నా హృదయంలో ఏది అనిపిస్తే అదే చేస్తా.. నా రిటైర్ మెంట్ సరైందేనని నాకు తెలుసు’ అంటూ వీడియోలో ఆష్లీ పేర్కొంది. నా టెన్సిస్ లైఫ్ లో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు పంచిన జీవితకాల జ్ఞాపకాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను.” అని ఆష్లీ తెలిపింది.
Also Read: ‘ది కశ్మీర్ ఫైల్స్’ గొప్పతనం గురించి చెప్పిన ఆర్జీవీ
బార్టీ 2019 ఫ్రెంచ్ ఓపెన్‌లో తన తొలి గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకుంది. గత ఏడాది వింబుల్డన్‌లో విజయం సాధించడంతో ఆమె అప్పటి నుంచి అగ్రశ్రేణి ప్లేయర్‌గా కొనసాగుతోంది. 44 ఏళ్లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల లేదా మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా ఆష్లీ నిలిచింది.
సెరెనా విలియమ్స్ క్లే, గ్రాస్ మరియు హార్డ్ కోర్ట్‌లలో ప్రధాన టైటిళ్లను గెలుచుకున్న తర్వాత అంతటి ఘనత సాధించి ఇతర క్రియాశీల మహిళా క్రీడాకారిణి ఆష్లీనే కావడం విశేషం..
గత సంవత్సరంలో టెన్నిస్ ఆడే ఆస్ట్రేలియన్ పిల్లల సంఖ్య దాదాపు 30% ఎలా పెరిగింది. వీరిలో చాలా మంది స్వదేశీ బాలికలే కావడం విశేషం..
బార్టీ 2014లో టెన్నిస్ నుండి విరామం తీసుకుంది. టెన్నిస్ లో తన డిమాండ్లను పేర్కొంటూ క్రికెట్ మహిళల బిగ్ బాష్ లీగ్ ప్రారంభ సీజన్‌లో ఆడింది. క్రికెట్ ను కూడా ఆష్లీ ఆడగలదు. బహుషా ఆ ఆటకు టర్న్ అవుతుందేమో చూడాలి.
Also Read: AP Assembly: ఏపీ అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ.. భజన చేసుకోవాలన్న స్పీకర్