Homeక్రీడలుక్రికెట్‌Arya Man : సచిన్, విరాట్, ధోని, రోహిత్ కంటే ఈ క్రికెటరే అత్యంత ధనవంతుడు.....

Arya Man : సచిన్, విరాట్, ధోని, రోహిత్ కంటే ఈ క్రికెటరే అత్యంత ధనవంతుడు.. ఇతడి ఆస్తి ఎన్ని వేల కోట్లంటే?

Arya Man : మనదేశంలో అత్యంత శ్రీమంతులైన క్రికెటర్లు ఎవరంటే వెంటనే మనకు సచిన్, ధోని, రోహిత్, విరాట్ కోహ్లీ పేర్లు గుర్తుకు వస్తాయి. సమకాలీన క్రికెట్ లో సచిన్, ధోని, రోహిత్, విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డులు సృష్టించారు. ఆర్జన లోనూ అనితర సాధ్యమైన ఘనతలను తమ సొంతం చేసుకున్నారు. నేటికీ సంపాదన విషయంలో ఈ నలుగురు క్రికెటర్లు టాప్ -4 స్థానాల్లో కొనసాగుతున్నారు.

సచిన్ టెండుల్కర్ తన కెరియర్ కు ముగింపు పలికి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ.. ఆర్జన విషయంలో ఇప్పటికీ టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఒక అండార్స్మెంట్ కు తక్కువలో తక్కువ 3 నుంచి ఐదు కోట్ల దాకా వసూలు చేస్తున్నాడు. ఇక విరాట్ అయితే చెప్పాల్సిన పనిలేదు. పేరుపొందిన బహుళ జాతి సంస్థలతో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ధోని కూడా అదే స్థాయిలో తన హవా కొనసాగిస్తున్నాడు. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ తన మార్కెట్ ను మరింత పెంచుకున్నాడు. మనదేశంలో పేరుపొందిన సంస్థలతో ఈ నలుగురు క్రికెటర్లు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తమ మార్కెట్ వేల్యూ ప్రకారం రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం డబ్బు విషయంలో సచిన్, విరాట్, ధోని, రోహిత్ టాప్ -4 స్థానాల్లో కొనసాగుతున్నారు. సంపాదనలో ఈ నలుగురు క్రికెటర్లే ముందంజలో ఉన్నారు. అయితే వారిని మించిన క్రికెటర్ ఇప్పుడు ఉన్నాడు. అలాగని ఇతడు ఫేమస్ ఆటగాడు కాదు.. కాకపోతే ఇతడికి వ్యాపార నేపథ్యం ఉంది.

వేల కోట్లకు అధిపతి

సిమెంట్, వస్త్ర వ్యాపారంలో ఆదిత్య బిర్లా కంపెనీ గురించి తెలియని వారు ఉండరు.. సిమెంట్, వస్త్రాల తయారీ మాత్రమే కాకుండా మోర్ వంటి సూపర్ మార్కెట్లను నిర్వహిస్తూ ఆదిత్య బిర్లా గ్రూపు తనదైన ముద్ర వేసుకుంది.. విద్యుత్తు తయారీ, ఇతర కంపెనీలు కూడా ఆదిత్య బిర్లా గ్రూపులో ఉన్నాయి. ఆదిత్య బిర్లా గ్రూపుకు చైర్మన్గా కుమార్ మంగళం కొనసాగుతున్నారు. ఆయన కొడుకు పేరు ఆర్య మాన్. ఇతడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆర్య మాన్ సత్తా చాటాడు. కుడి చేతివాటం బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ అతడు పెద్దగా క్రికెట్ ఆడటం లేదు. స్పోర్ట్స్ వర్గాల సమాచారం ప్రకారం ఆర్య మాన్ ఆస్తులు 70 వేల కోట్లకు ఉంటాయని తెలుస్తోంది. కుమార్ మంగళానికి ఆర్యమాన్ ఒక్కడే కుమారుడు కావడంతో అతని ఆస్తుల విలువ ఆ స్థాయిలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం తన తండ్రి ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీల నిర్వహణ బాధ్యతను ఆర్య మాన్ చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. విభిన్నమైన వ్యాపారాల్లోకి ప్రవేశించాలని ఆర్య మాన్ భావిస్తున్నట్టు సమాచారం..

30 లక్షలకు కొనుగోలు చేసి అమ్మాడు

కుమార్ మంగళం బిర్లా 2018లో ఐపిఎల్ ప్రారంభమైనప్పుడు.. 30 లక్షలతో రాజస్థాన్ రాయల్స్ జట్టను కొనుగోలు చేశారు. ఆ ఏడాది షేన్ వార్న్ ఆధ్వర్యంలో రాజస్థాన్ జట్టు విజేతగా నిలిచింది. దీంతో ఆ జట్టు వ్యాల్యూ అమాంతం పెరిగింది. ఆ తర్వాత 2019లో కుమార మంగళం బిర్లా రాజస్థాన్ జట్టును విక్రయించారు.. అయితే ప్రస్తుతం ఆర్య మాన్ క్రికెట్ కు రిటర్మెంట్ ప్రకటించినట్టు ప్రచారం జరుగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular