India vs Pakistan Match: ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా లెజెండ్స్ క్రికెట్ టోర్నీ జరిగింది. ఈ టోర్నీలో భారత జట్టు నుంచి కూడా ఆటగాళ్లు ఆడారు. సెమీఫైనల్ లో పాకిస్తాన్ జట్టుతో తలపడాల్సి వచ్చినప్పుడు.. భారత ఆటగాళ్లు నిరాకరించారు. పహల్గాం దాడి నేపథ్యంలో.. నెత్తురు, నీళ్లు కలిసి పారలేవని భారత ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానించారు. ఆ మాటలను ఉటంకిస్తూ.. తాము దేశ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే వ్యవహరిస్తామని.. ఎట్టి పరిస్థితుల్లో దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారితో ఆడబోమని స్పష్టం చేశారు. దీంతో భారత లెజెండ్ ఆటగాళ్ల మీద ప్రశంసలు కురిసాయి. మన జట్టు ఆడక పోవడంతో దాయాది జట్టు నేరుగా ఫైనల్ వెళ్ళింది. కానీ దక్షిణాఫ్రికా జట్ట చేతిలో ఓటమిపాలైంది. మన జట్టు దాయాది జట్టుతో ఆడక పోవడం వల్ల జరిగిన నష్టానికి కంటే.. వచ్చిన పేరే ఎక్కువ. భారత ఆటగాళ్లు అసలు సిసలైన జాతీయ తత్వాన్ని ప్రదర్శించారని మీడియాలో ప్రశంసలు లభించాయి.
ఇప్పుడు ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ జట్టుతో భారత జట్టు తలపడబోతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 14న భారత్ , పాకిస్తాన్ పోటీ పడబోతున్నాయి. ఈ మ్యాచ్ కి సంబంధించి టీ మీడియా వైస్ కెప్టెన్ గిల్ ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశాడు. ఆట మొదలు పెడదామా అంటూ అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఇది సహజంగానే కొంతమంది అభిమానులలో ఆగ్రహాన్ని కలిగించింది. గిల్ చేసిన ట్వీట్ కు సైన్యంలో పనిచేసిన ఓ మాజీ అధికారి దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చారు..”మన శత్రువుతో ఆట ఆడిన రోజు.. మీ ఆట కూడా అయిపోతుంది అంటూ” ఘాటు రిప్లై ఇచ్చాడు. దీంతో ఏం చేయాలో తెలియక గిల్ అలా సైలెంట్ అయిపోయాడు. అయితే ఆ మాజీ సైనిక అధికారి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
పాకిస్తాన్ జట్టుతో ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడకూడదని అభిమానులు కోరుతున్నారు. ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పారించిన నరమేధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. అటువంటి దేశంతో క్రికెట్ ఇలా ఆడతారంటూ భారత అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ద్వైపాక్షికమే కాదు, ఎందులోనైనా పాకిస్తాన్ జట్టుతో క్రికెట్ ఆడకూడదని భారత అభిమానులు మండిపడుతున్నారు. క్రికెట్ మాత్రమే కాదు, ఇతర క్రీడల్లోనూ ఇదే ధోరణి కొనసాగించాలని.. అప్పుడే మనం అంటే ఏంటో పాకిస్తాన్ జట్టుకు తెలుస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. మనం ఆడకపోతే పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు యాడ్ రెవెన్యూ రాదని.. అప్పుడు చచ్చినట్టు కాళ్ల బేరానికి వస్తారని అంటున్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించబోవు అని చెప్పినవారు.. ఇప్పుడు క్రికెట్ ను కలిసి ఎలా ఆడతారంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Let the games begin pic.twitter.com/i5Qydk3aDH
— Shubman Gill (@ShubmanGill) September 9, 2025