MS Dhoni: ఇండియన్ క్రికెట్ టీమ్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా గుర్తింపు పొందిన వారిలో ధోని మొదటి స్థానంలో ఉంటాడు. ఎందుకంటే ధోని ఇండియన్ టీం కి ఐసీసీ నిర్వహించిన అన్ని ట్రోఫీలను అందించాడు.అలాగే ఇండియన్ టీమ్ తరపున ఐసిసి నిర్వహించిన అన్ని ట్రోఫీ లను అందించిన ఏకైక కెప్టెన్ గా కూడా ధోని చరిత్రలో నిలిచాడు.ఇక టి20 వరల్డ్ కప్ స్టార్ట్ అయిన మొదటి సంవత్సరమే ఆ ట్రోఫీ ని అందించిన కెప్టెన్ గా కూడా ఈతరం అభిమానులందరికీ ధోని సుపరిచితుడు. అయితే ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు చాలామంది హీరోయిన్లతో ఎఫైర్ నడిపినట్టుగా అప్పట్లో వార్తలు పుష్కలంగా వచ్చేవి. అయితే ధోని ఎఫైర్ నడిపిన హీరోయిన్ల లిస్ట్ ఒకసారి మనం చూసుకుంటే…
దీపికా పదుకొనే
ధోని ఇండియన్ టీమ్ కి కెప్టెన్ గా ఎదిగిన తర్వాత టి20 వరల్డ్ కప్ ని అందించాడు. ఆ తర్వాత ప్రేక్షకుల్లో ఆయన మీద అభిమానం అనేది తార స్థాయిలోకి వెళ్ళిపోయింది.ఇక ఇలాంటి సందర్భంలో ఎవరిని చూసిన ధోని జపం చేస్తుండేవారు పొడవాటి జుట్టు వేసుకొని ధోని గ్రౌండ్ లో ఉంటే స్టేడియం మొత్తం ధోని ధోని అనే అరుపులతో మార్పుమ్రోగిపోయేది అలాంటి ధోని దీపిక పదుకొనె తో ప్రేమ వ్యవహారం నడిపాడు చాలా రోజుల పాటు ఇద్దరు డేటింగ్ చేసిన తర్వాత మధ్యలోకి యువరాజ్ సింగ్ ఎంటర్ అవ్వడంతో దీపిక పడుకొనే నుంచి ధోని దూరమైనట్టుగా అప్పట్లో మీడియా లో చాలా కథనాలు కూడా వచ్చాయి…
ప్రీతి సిమోస్
ప్రీతి సిమోస్ ధోని ఇద్దరు కలిసి చాలా రోజుల పాటు చెట్ట పట్టాలు వేసుకొని తిరిగినట్టు గా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.ఇక ప్రీతి సిమోస్ ధోని అంటే నాకు ఇష్టం అని ఓపెన్ గా చెప్పింది అయినప్పటికీ ధోనీ మాత్రం ఆ మ్యాటర్ మీద ఎలాంటి స్పందన తెలియజేయలేదు…
లక్ష్మి రాయ్
రాఘవ లారెన్స్ దర్శకత్వం లో వచ్చిన కాంచన సినిమాలో హీరోయిన్ గా నటించిన లక్ష్మి రాయ్ ఆ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. అయితే లక్ష్మి రాయ్ కూడా ధోనీ తో ఎఫైర్ నడిపిన విషయం అప్పట్లో చాలా వైరల్ అయింది.ధోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్న టైం లో లక్ష్మి రాయ్ ఆ టీమ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది. అలా ఉన్న ఆ టైం లో ఒక మూడు సంవత్సరాలు వీళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారనే వార్తలు వచ్చాయి. అలాగే వీళ్లిద్దరూ అప్పట్లో ఒకే రూమ్ లో కలిసి ఉండేవారు అనే న్యూస్ కూడా అప్పట్లో బాగా వినిపించింది…
అసిన్
ఈమె తెలుగు లో రవితేజ హీరో గా వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది.ఆ సినిమాతో ఇక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ధోని అసిన్ చాలా రోజుల పాటు ప్రేమించుకున్నారు. ఒకానొక సమయం లో ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పటికీ ఇద్దరి మధ్య వచ్చిన కొన్ని మనస్పర్థల వల్ల వాళ్ళు విడిపోయారు…
ఇక ఆ తరువాత ధోని 2010 లో తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన సాక్షి సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు…ఇక ప్రస్తుతం ధోని క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ అభిమానుల రిక్వెస్ట్ మేరకు ఐపిఎల్ లో మాత్రం ఆడుతున్నాడు…