Homeక్రీడలుVVS Laxman Son: భారత్ క్రికెట్ లోకి మరో వారసుడు.. వివిఎస్ లక్ష్మణ్ కుమారుడి బ్యాక్...

VVS Laxman Son: భారత్ క్రికెట్ లోకి మరో వారసుడు.. వివిఎస్ లక్ష్మణ్ కుమారుడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఏం చేస్తున్నాడు

VVS Laxman Son: భారత క్రికెట్ లో ఎంతోమంది ఆటగాళ్లు ఒక వెలుగు వెలిగారు. సుదీర్ఘకాలం పాటు భారత్ క్రికెట్ కు సేవలందించి రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం వారంతా వివిధ దేశాలకు, ప్రాంజీలకు కోచ్ లుగా, మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు. మరి కొంతమంది మాజీ క్రికెటర్లు విశ్లేషకులుగా పనిచేస్తున్నారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే క్రికెట్ కు దూరంగా ఉంటూ తమ పిల్లలను వారసులుగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. అదే కోవకు చెందుతారు మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్. ఆయన కుమారుడుని క్రికెటర్ గా తీర్చిదిద్దిన ఆయన.. కొద్దిరోజుల్లోనే బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

భారత క్రికెట్ లో టెస్ట్ స్పెషలిస్ట్ గా పేరుగాంచాడు హైదరాబాదుకు చెందిన వివిఎస్ లక్ష్మణ్. సుదీర్ఘ కాలం పాటు టెస్ట్ క్రికెట్ ఆడి అనేక రికార్డులను తన పేరుట నమోదు చేసుకున్నాడు. అటువంటి లక్ష్మణ్ కుమారుడు క్రికెట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఎంతో మంది మాజీ క్రికెటర్ల కుమారులు క్రికెట్ లోకి అడుగుపెట్టగా, ఇదే జాబితాలో చేరబోతున్నాడు వీవీఎస్ లక్ష్మణ్ కుమారుడు.

తొలి సీజన్ ను ఘనంగా మొదలుపెట్టిన సర్వజిత్..

హైదరాబాదుకు చెందిన మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుమారుడు సర్వజిత్ తన తండ్రి బాటలోనే ప్రయాణం సాగిస్తున్నాడు. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకొని ముందుకు సాగుతున్నాడు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సిఏ) లీగుల్లో తన తొలి సీజన్లో సర్వజిత్ ఘనంగా మొదలుపెట్టాడు. రెండు రోజుల లీగ్ లో భాగంగా సికింద్రాబాద్ నవాబ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వజిత్.. తన రెండో శతకాన్ని నమోదు చేశాడు. మొదటి మ్యాచ్లో 30 పరుగులు చేసిన అతను.. తాజా మ్యాచ్లో శతకాన్ని కొట్టి సత్తాను చాటాడు. ఫ్యూచర్ స్టార్ తో బుధవారం జరిగిన మ్యాచ్లో సర్వజిత్ 209 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 104 పరుగులు చేశాడు. అద్భుతమైన సాట్లతో అలరించిన సర్వజిత్.. లీగ్ కెరీర్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. కానీ అతని జట్టు సికింద్రాబాద్ నవాబ్స్ మాత్రం 191 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఫ్యూచర్ స్టార్ 70.5 5 ఓవర్లలో 427 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం సికింద్రాబాద్ నవాబ్స్ 71.3 ఓవర్లలో 236 పరుగులకే కుప్ప కూలింది. ఒక ఎండ్ లో సర్వజిత్ పోరాడినా.. మరో ఎండ్ లో వికెట్లు పడడంతో ఆ జట్టుకు పరాజయం తప్పులేదు. సర్వజిత్ మినహా మరో ఆటగాడు రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. సాయి కార్తికేయ (5/46), దివేష్ బజాజ్ (4/57) ఆ జట్టును కట్టడి చేశారు.

ఎడం చేతి బ్యాటర్ గా సర్వజిత్..

వీవీఎస్ లక్ష్మణ్ కుడి చేతి వాటం బ్యాటర్ కాగా, సర్వజిత్ మాత్రం ఎడమ చేతి వాటం బ్యాటర్. అద్భుతమైన టెక్నిక్, అంతకుమించిన టైమింగ్ తో కూడిన షాట్లు ఆడుతూ మెరుగైన బ్యాటింగ్ నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు సర్వజిత్. తాజా మ్యాచ్ లో చేసిన సెంచరీతో తనలోని ప్రతిభను బయట ప్రపంచానికి తెలియజేశాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా తాను భారత జట్టులోకి రాబోతున్నాను అన్న సంకేతాలను అందించినట్లు అయింది. భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించగలిగితే భారత టెస్టు జట్టులో తండ్రి మాదిరిగా కీలకమైన ప్లేయర్ గా ఎదిగేందుకు అవకాశం ఉందని, అటువంటి సామర్థ్యం కూడా ఈ యంగ్ బ్యాటర్ లో ఉందని నిపుణులు చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular