Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా చెన్నైలో లోని చిదంబరం స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా తో ఇండియా తన మొదటి మ్యాచ్ ని ఆడబోతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ టీమ్ ప్లేయింగ్ లెవన్ లో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటికే ఓపెనర్ ప్లేయర్ అయిన శుభ్ మన్ గిల్ డెంగ్యూ ఫీవర్ తో టీం కి దూరం అవ్వగా, ఇప్పుడు తెలుస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆస్ట్రేలియాతో మ్యాచ్ కి రెడీ అవుతున్న మన ప్లేయర్లు రీసెంట్ గా ప్రాక్టీస్ ని కూడా చేస్తున్నారు.
అందులో భాగంగానే సిరాజ్ వేసిన ఒక బౌన్సర్ బాల్ ని ఎదురుకోవడంలో మన ఆల్ రౌండర్ ప్లేయర్ అయిన హర్దిక్ పాండ్యా గాయానికి గురైనట్టుగా తెలుస్తుంది. ప్రాక్టీస్ లో సిరాజ్ వేసిన బౌన్సర్ ని సరిగ్గా ఎదుర్కోలేక హార్దిక్ పాండ్యా వేలికి భారీ గాయం అయింది ఆ గాయం తగిలిన వెంటనే ఆయన అక్కడి నుంచి బ్యాట్ వదిలేసి వెళ్లిపోయినట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఆస్ట్రేలియా తో జరిగే మ్యాచ్ కి ఇంకొక రోజు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ప్లేయర్లు అందరూ ఇలా వరుసగా టీం నుంచి దూరం అవ్వడం టీమ్ కి బాడ్ న్యూస్ అనే చెప్పాలి. హార్దిక్ పాండ్యా కి సంబంధించిన విషయాన్ని బిసిసిఐ ఆఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయనకి బలమైన గాయం తగిలినట్టుగా తెలుస్తుంది.ఇక దాంతో ఆయన టీంలో కొనసాగుతాడా లేదా అనేది తెలియాలి ఒకవేళ హార్థిక్ పాండ్య కనక టీమ్ లో లేకపోతే ఇండియన్ టీం కి భారీ నష్టమనే చెప్పాలి.
పాండ్యా ఆల్ రౌండర్ గా ఆడుతూ టీమ్ కి మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటాడు.ఇప్పుడు హార్దిక్ పాండ్యా లేకపోతే టీం లో 5వ బౌలర్ ని కోల్పోవాల్సి వస్తుంది. అలాగే చివర్లో ఫినిషర్ ని కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి పాండ్యా ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఉండడం చాలా కీలకం. మరి అతను ఈ మ్యాచ్ ఆడతాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మనం కొద్ది గంటలు వెయిట్ చేయక తప్పదు…
మొన్నటి వరకు బాగానే ఉన్న టీం ఇండియన్ ప్లేయర్లు మ్యాచ్ లు స్టార్ట్ అయ్యే ముందే వరుసగా ఇలా ఒకరి వెనుక ఒకరు టీం కి దూరమవుతూ ఉండడం అనేది టీమ్ కి భారీ నష్టంగా చెప్పవచ్చు. ఇప్పటికే గిల్ డెంగ్యూ ఫీవర్ తో దూరం అవ్వడం అతని ప్లేస్ లో ఇషాన్ కిషన్ రావడం అనేది జరిగింది…