GT Vs RCB: ఐపీఎల్ లో యాజమాన్యాలు ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంటాయి. ట్రోఫీ గెలిస్తే యాజమాన్యాలకు పంట పండుతుంది. జట్టు విలువ పెరుగుతుంది. మార్కెట్ విలువ పెరగడం వల్ల డబ్బులు బాగా వస్తాయి. బీసీసీఐ నుంచి కూడా భారీగానే నగదు వస్తుంది కాబట్టి యాజమాన్యాలు పండగ చేసుకుంటాయి. 2008 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్లో ఈ తంతు దర్జాగా కొనసాగుతోంది.
దండిగా ఆదాయం వస్తున్న నేపథ్యంలో చాలావరకు కార్పొరేట్ కంపెనీలు క్రికెట్లోకి ప్రవేశిస్తున్నాయి. ప్రవేశించడం మాత్రమే కాదు.. ఆటగాళ్ల కొనుగోలు నుంచి మొదలు పెడితే మార్కెటింగ్ వరకు ప్రతి విషయంలోనూ లెక్కలు వేసుకుంటున్నాయి. పెట్టిన పెట్టుబడికి అంతకుమించి అనే స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నాయి. ఐపీఎల్లో ప్రతి జట్టు యాజమాన్యానికి డబ్బులు వస్తాయి. ప్రొఫెషన్ జట్టుకు మరింత ఎక్కువగా వస్తాయి. అందువల్లే ప్రతి యాజమాన్యం కూడా తమ జట్టు గెలుపొందాలని.. ట్రోఫీ ని సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉంటుంది.
ఐపీఎల్ చరిత్రలో ఒకే యాజమాన్యం రెండు జట్లకు ప్రాతినిధ్యం వహించినట్టు ఇంతవరకు లేదు. అయితే ఒక యువ వ్యాపారవేత్త అత్యంత తెలిపిగా ఐపీఎల్లో రెండు జట్లకు యజమానిగా వ్యవహరిస్తున్నారు. అదే కాదు సోషల్ మీడియాలో ఆమె విపరీతంగా ట్రెండ్ అవుతున్నారు. మరి కొద్ది సేపట్లో గుజరాత్, బెంగళూరు జట్ల మధ్య జరిగే పోరులో ఎవరు గెలిచినా సరే ఆమెకు డబ్బులే డబ్బులు. దీని అంతటికి కారణం ఆమె రెండు జట్లలో పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులు పెట్టిన ఆ యువ వ్యాపారవేత్త పేరు అనన్య బిర్లా.
అనన్య బిర్లా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. మోడల్ కూడా. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ కన్సర్షియం కొనుగోలు చేసింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టుతో బిర్లా ఎస్టేట్స్ కు భాగస్వామ్యం ఉంది. ఈ రెండిట్లో కూడా అనన్య భాగస్వామిగా ఉన్నారు. ఈమె ఏ జట్టుకు సపోర్ట్ చేస్తారో తెలియదు గాని.. ఏ జట్టు గెలిచినా సరే ఈమెకు డబ్బులే డబ్బులు. కాకపోతే గుజరాత్ జట్టు కెప్టెన్.. బెంగళూరు జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీతో ఆమె దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి.
