Odi World Cup 2023: వరల్డ్ కప్ లో ప్రస్తుతం నాలుగు టీంలు సెమీఫైనల్ కి చేరుకున్నాయి.మిగతా ఆరు టీంలు టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిపోయి ఇప్పటికే ఇంటికి వెళ్ళిపోయాయి. వరల్డ్ కప్ ని సాధించాలి అంటే ఇండియా ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ లు ఒక లెక్క ఇప్పుడు ఆడాల్సిన రెండు మ్యాచ్ లు ఒక లెక్క…ఇక నాకౌట్ మ్యాచ్ లను ఇండియా దైర్యం గా ఎదురుకుంటుందనే కాన్ఫిడెంట్ ప్రతి ఒక్కరి లో ఉంది.
ముఖ్యంగా ఈనెల 15 వ తేదీన ఇండియా న్యూజిలాండ్ టీమ్ ల మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఇక ఇలాంటి క్రమంలో ఈ రెండు టీంలలో ఏ టీం విజయం సాధిస్తుంది అనేది ఇక్కడ చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇండియన్ టీం టాప్ పొజిషన్ లో ఉంది కాబట్టి టైటిల్ ఫేవరెట్ గా సెమీస్ లో బరిలోకి దిగుతుంది.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇండియన్ టీమ్ 2015 నుంచి చూసుకుంటే న్యూజిలాండ్ మీద ఒక్క నాకౌట్ మ్యాచ్ కూడా గెలవడం లేదు. ఇక ఈసారి దాన్ని ఓవర్ కం చేయాలని ఇండియన్ టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఇండియాతో పాటుగా ఈ టోర్నీ లో మరోక టీమ్ కూడా అత్యంత స్ట్రాంగెస్ట్ టీమ్ గా కనిపిస్తుంది. ఇప్పటివరకు ప్రపంచ హిస్టరీ లోనే ఐదు సార్లు వరల్డ్ కప్ గెలిచి తమ సత్తా ఏంటో చాటుకున్న ఆస్ట్రేలియన్ టీం…
నిజానికి ఆస్ట్రేలియా టీమ్ ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ లో ఇండియా మీద ఆడినప్పుడు 200 పరుగుల లోపే ఆలౌట్ అయి చాలా దారుణమైన పొజిషన్ లో ఓడిపోయింది. ఇక సెకండ్ మ్యాచ్ కూడా సౌతాఫ్రికా మీద ఓడిపోయింది. దాంతో ఆస్ట్రేలియా పని అయిపోయింది ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ కి కూడా అర్హత సాధించదు అని అందరూ అనుకున్నారు. కానీ అనతి కాలంలోనే బౌన్స్ బ్యాక్ అయి వరుస విజయాలను అందుకుంటూ ఆస్ట్రేలియా సత్తా ఏంటో చూపిస్తూ వస్తున్నారు. ఇక రీసెంట్ గా ఆఫ్గనిస్తాన్ మీద జరిగిన మ్యాచ్ లో అయితే ఆస్ట్రేలియా టీమ్ 91 పరుగుల వద్ద 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఆ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరూ ఆస్ట్రేలియా టీమ్ కి పసికూన అయిన అఫ్గాన్ చేతిలో ఓటమి తప్పదు అని అందరూ అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తు ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన గ్లెన్ మ్యాక్స్ వెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఈ టోర్నీ లో మొదటి డబుల్ సెంచరీ నమోదు చేసి అజయంగా నిలిచి మ్యాచ్ ని విజయ తీరాలకు చేర్చాడు.ఆ మ్యాచ్ లో మాక్స్ వెల్ ఆడిన అత తీరు ని చూస్తే ప్రతి ఒక్కరికీ ఆస్ట్రేలియన్ టీం అంటే గుండెల్లో దడ పుట్టేలా ఆడాడు …
ఇక ఇప్పుడూ ఆస్ట్రేలియన్ టీం ఉన్న పరిస్థితుల్లో ఆ టీంను ఎదురుకోవడం చాలా వరకు కష్టమనే చెప్పాలి. ఒకరకంగా ఈ టోర్నీ లో ఇండియా ని ఎదిరించడం ఎంత కష్టంగా మారిందో అలాగే ఆస్ట్రేలియా టీం ను ఓడించడం కూడా అంతే కష్టంగా మారింది. ఆ టీమ్ లో ఉన్న ప్రతి ప్లేయర్ కూడా ఒక్కొక్క మ్యాచ్ లో తమ ఇంపాక్ట్ ని చూపిస్తూ ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లుగా మారుతూ మ్యాచ్ ని విజయతీరాలకు చేరుస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా టీం లో ఒక్క ప్లేయర్ కాదు 11 మంది ప్లేయర్లు కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక సెమీ ఫైనల్ లో సౌతాఫ్రికా టీమ్ ఆస్ట్రేలియా ని ఎలా ఎదురుకుంటుందొ చూడాలి.
ఇక ఆస్ట్రేలియా జోరు చూస్తుంటే ఫైనల్ కి చేరుకొని కప్పు కూడా ఎగరేసుకు పోదాం అనేంత రేంజ్ లో ముందుకు దూసుకుపోతుంది. ఇండియా సెమీస్ లో గెలిచి ఫైనల్ కి వెళ్తే అలాగే ఆస్ట్రేలియా కూడా ఫైనల్ కి చేరితే 2003 వ సంవత్సరం లో జరిగిన ఫైనల్ మ్యాచ్ కి ఇండియన్ టీమ్ ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటారా అనేది చూడాలి…