Alcaraz French Open final victory : ఫ్రెంచ్ పురుషుల చివరి అంచె పోటీ ఉత్కంఠ గా సాగింది. ఎన్నో మలుపుల మధ్య 21 సంవత్సరాల అల్కరజ్ ను విజేతను చేసింది. మట్టి కోటకు ప్రిన్స్ ను చేసింది. అతడికి ఇది రెండవ టైటిల్. చివరి అంచె పోటీలో అల్కరజ్ విజయం సాధించాడు. ఆదివారం రోజు జరిగిన ఈ మ్యాచ్లో అల్కరజ్ విజేతగా నిలిచాడు.. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ప్రపంచ ప్రథమ శ్రేణి ఆటగాడు సిన్నర్ ను 4-6, 6-7(4-7), 6-4, 7-6(7-3), 7-6(10-2) తేడాతో మట్టి కరిపించాడు.. సరిగ్గా గత ఏడాది ఇదే వేదిక మీద సెమి ఫైనల్ మ్యాచ్లో సిన్నర్ ను అల్కరజ్ ఓడించాడు. అదే ఊపును ఈ ఏడాది ఫైనల్ మ్యాచ్లో కూడా కొనసాగించాడు. అల్కరజ్ కు ఇది ఐదవ గ్రాండ్ స్లామ్.. ఇక ఈ మ్యాచ్లో సిన్నర్ ఎనిమిది, అల్కరజ్ 7 ఏస్ లు సంధించి చరిత్ర సృష్టించారు.
ఇద్దరు తొలి రెండు సెట్లలో..
అటు సిన్నర్, ఇటు అల్కరజ్ ఇద్దరు యువ ఆటగాళ్లే. ఒక్క పాయింట్ కోసం మైదానంలో కొదమ సింహాల మాదిరిగా పోరాటం చేశారు. వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడిన నేపథ్యంలో తొలిగేమ్ ఏకంగా 12 నిమిషాల పాటు సాగింది. ఈ దశలో సిన్నర్ 1-0 తేడతో తన సర్వీసును కాపాడుకొని.. అదరగొట్టాడు.. దీంతో ప్రేక్షకులు కూడా అతనికి మద్దతు పలికారు. ఈ దశలో బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా అల్కరజ్ ఫస్ట్ బ్రేక్ పాయింట్ అందుకున్నాడు. ఆ తర్వాత 3-2 వ్యత్యాసంతో లీడ్ సాధించాడు. ఇక ఇదే క్రమంలో సిన్నర్ ఆరవ గేమ్ బ్రేక్ చేసుకున్నాడు. ఏడవ గేమ్ లో సర్వీస్ కాపాడుకున్నాడు. ఫలితంగా 4-3 తేడాతో అతడు నిలిచాడు. ఇదే ఉత్సాహంలో మరో బ్రేక్ పాయింట్ అందుకున్నాడు. దాంతోపాటు 6-4 వ్యత్యాసంతో సెట్ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక రెండవ సెట్ లో సిన్నర్ అత్యంత పదునైన సర్వీస్ చేశాడు. బేస్ లైన్ ఆటలో దూకుడుని ప్రదర్శించాడు. 4-1 తేడాతో ముందుకు వెళ్లాడు.. అయితే 9వ గేమ్ ను అల్కరజ్ బ్రేక్ చేశాడు. ఇదే ఉత్సాహంలో సర్వీస్ కూడా కాపాడుకున్నాడు.. ఫలితంగా స్కోర్ చెరి ఐదు పాయింట్లతో సమానమైంది. ఇద్దరు కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో సెట్ టై బ్రేక్ కు దారి తీసింది. ఈ దశలో సిన్నర్ 7-6 తో దానిని ముగించాడు. మూడో గేమ్ లో అల్కరజ్ అదరగొట్టాడు. తన సర్వీసును మొదట కోల్పోయినప్పటికీ.. వరుసగా మూడు పాయింట్లు సాధించి తన లీడ్ కాపాడుకున్నాడు. ఏమాత్రం పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా పదవ గేమ్ ను ఊహించని విధంగా బ్రేక్ చేశాడు. అంత కాదు పోటీలో నిలబడ్డాడు.. ఫలితంగా సిన్నర్ తలవంచక తప్పలేదు. అంతేకాదు అతని 31 వరుస గ్రాండ్ స్లామ్స్ సెట్ గెలుపుల పరంపరకు అడ్డుకట్ట పడింది.
సర్వీసులను నిలుపుకుంటూ..
ఇద్దరు ప్లేయర్లు కూడా మూడు మ్యాచ్ పాయింట్లను కాచుకున్నారు. అంతేకాదు గంట ఏడు నిమిషాల పాటు నాలుగో సెట్ కొనసాగించారు. తమ సర్వీసులను నిలుపుకున్నారు. కాపాడుకుంటూ వేగంగా ముందుకు సాగారు. ఏడవ గేమ్ ను సిన్నర్ బ్రేక్ చేశాడు.. ఈ పరిణామాన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకున్నాడు అల్కరజ్.. అంతేకాదు సర్వీస్ కాపాడుకొని 5-3 తిడత అప్పర్ హ్యాండ్ సాధించాడు.. ఇక కీలకమైన తొమ్మిదవ గేమ్ లో అల్కరజ్ మూడు ఛాంపియన్ షిప్ పాయింట్లు ఎదుర్కోవడం గమనార్హం. ఈ సమయంలో ఒక్కసారిగా రైజ్ అయిన అతడు.. బ్రేక్ సాధించి వరుసగా మూడు పాయింట్లు అందుకొని.. 6-5 దాకా వెళ్ళిపోయాడు. ఫలితంగా మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠకు దారితీసింది.. అయితే 12వ గేమ్ లో బ్రేక్ పాయింట్ సాధించి ఇటలీ ఆటగాడు అదరగొట్టాడు. అయితే ఈ సెట్ లో సిన్నర్ 6 పాయింట్లు సాధించగా.. అల్కరజ్ ఒక పాయింట్ తేడాతో గెలిచేసాడు.
ఇక ఐదవ సెట్ లో స్పెయిన్ ఆటగాడు బ్రేక్ పాయింట్ ద్వారా తన ఉద్దేశాన్ని తెలియజేశాడు. ఇక పదవ గేమ్ లో సిన్నర్ ఛాంపియన్ షిప్ సర్వీస్ ను స్పెయిన్ ఆటగాడు బద్దలు కొట్టాడు. తర్వాత మరో పాయింట్ సాధించి సిన్నర్ పోటీలోకి వచ్చాడు.. అయితే ఇదే దశలో అల్కరజ్ సిన్నర్ సర్వీస్ ను బ్రేక్ చేశాడు.. అయితే కీలకమైన ఈ దశలో ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా అల్కరజ్ 7-6 తేడాతో మ్యాచ్ ను ముగించి.. విజేతగా నిలిచాడు.
ఇక ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ ఇదే కావడం విశేషం.. మొత్తంగా గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ లో ఇది రెండవ సుదీర్ఘమైన మ్యాచ్. 2012లో జకో, రఫెల్ మధ్య ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ మ్యాచ్ ఐదు గంటల 53 నిమిషాల పాటు కొనసాగడం విశేషం.
Winning Moment..ALCARAZ#FrenchOpen #RolandGarros2025 pic.twitter.com/iN0VSpMISQ
— Bottom Edge (@BottomEdge) June 8, 2025