spot_img
Homeక్రీడలుక్రికెట్‌Ajinkya Rahane: కోల్ కతా కెప్టెన్ పై కుట్రలు.. అసలు విషయాన్ని బయటపెట్టిన అజంక్యా రహానే

Ajinkya Rahane: కోల్ కతా కెప్టెన్ పై కుట్రలు.. అసలు విషయాన్ని బయటపెట్టిన అజంక్యా రహానే

Ajinkya Rahane: కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అనే సామెత మనం విన్నాం కదా.. ఇది నిజ జీవితంలో కోల్ కతా కెప్టెన్ అజంక్య రహానే కు అనుభవంలోకి వచ్చినట్టుంది. ఎందుకంటే అతను చేసిన వ్యాఖ్యలు పై సామెతను గుర్తుచేస్తున్నాయి..

ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 65 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని మూట కట్టుకుంది.. ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో ఇది కోల్ కతా జట్టుకు వరుసగా రెండవ ఓటమి. ఈ ఓటమి తర్వాత రహానే మీద సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. 2025లో.. ఇప్పుడు 2026 లో కోల్ కతా జట్టు ఇలా అయిపోవడానికి రహానే కారణమని చాలామంది ఆరోపిస్తున్నారు. కొందరైతే మరింత లోతుగా వెళ్లి తల తోకా లేని విశ్లేషణ చేసి.. రహానేను విలన్ చేస్తున్నారు.

తనపై చేస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని రహానే ఇప్పటికే తీపి కొట్టాడు. విలేకరుల సమావేశంలో గట్టి కౌంటర్ ఇచ్చాడు.. వాస్తవానికి రహనే ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. “నా స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు ఉత్తమంగా ఉన్న స్ట్రైక్ రేట్లలో నాదేముందు వరసలో ఉంటుంది. నా గురించి మాట్లాడే వ్యక్తులు నా ఆటను చూసి ఉండరు కావచ్చు. ఒకవేళ వారికి వ్యక్తిగతంగా ఎజెండాలు ఉన్నాయి కావచ్చు. నేను ఆడటం వారికి ఇష్టం లేదు. అందువల్లే నా మీద కుట్రలు చేస్తున్నారు. నేను స్వేచ్ఛగా ఆడుతుంటే వారు తట్టుకోలేకపోతున్నారు. నేను సాధిస్తున్న విజయాలు చూసి ఓర్వలేక పోతున్నారని” రహానే ఆరోపించాడు.

కోల్ కతా సారధిగా రహనే ఒత్తిడి ఎదుర్కోవడానికి ప్రధాన కారణం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతని కేవలం 8 పరుగులు మాత్రమే చేయడం… ఫిన్ అలెన్.. రఘు వంశీ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసినప్పటికీ.. కోల్ కతా జట్టు విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ జట్టు కేవలం 16 ఓవర్లలో 161 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక ఈ ఐపీఎల్లో మార్చి 29న ముంబై జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో రహానే 40 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అయినప్పటికీ ఆ మ్యాచ్లో ముంబై జట్టు విజయం సాధించింది. గత సీజన్లో కోల్ కతా జట్టుకు నాయకుడిగా వ్యవహరించాడు రహానే. 147.73 స్ట్రైక్ రేట్ తో 13 బ్యాచులలో 390 పరుగులు చేశాడు. కోల్ కతా జట్టు తరుపున గత సీజన్లో హైయెస్ట్ రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రహనే ఆకట్టుకోలేకపోయాడు. అందువల్ల విమర్శకులు అతని లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అతడు తట్టుకోలేక విలేకరుల సమావేశంలో బరస్ట్ అయ్యాడు. తన ఆట తీరు చూసి చాలామంది కుళ్ళు కుంటున్నారని ఆరోపించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular