Shikhar Dhawan: తాజాగా టీమిండియా వెస్టిండీస్ మరియు ఇంగ్లాండ్ లో పర్యటిస్తూ మ్యాచ్ లతో ఫుల్ బిజీగా ఉంది. సంవత్సరం చివరలో ప్రపంచ కప్ ఉండనే ఉంది.. ఈలోపు ఈ నెలాఖరులో ఆసియా కప్ మొదలు కాబోతోంది. ఈ నేథ్యంలో ఆగస్టు 30న టీమ్ ఇండియా ఆసియా కప్ లో పాల్గొనడం కోసం శ్రీలంక పర్యటించనుంది. ఇలాంటి తరుణంలో టీం ఇండియన్ ప్లేయర్ తీసుకున్న ఒక నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది…
గత కొద్దికాలం టీం ఇండియన్ ప్లేయర్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తెగించి ఆడాల్సిన ప్రతి మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ చేతులెత్తిస్తోంది….. ఫస్ట్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాస్త తడబడితే ఇక మ్యాచ్ చేయిజారిపోయినట్లు కన్ఫర్మ్ అయిపోవాల్సిందే.. ఈ క్రమంలో 2023 ఆసియా కప్ కోసం టీం ఇండియా ప్రకటించిన జట్టు వివరాలు అభిమానులను నిరాశపరిచాయి. ఈసారి కూడా టీం రోహిత్ శర్మ నేతృత్వంలో ముందుకు సాగబోతుంది.
టీం సెలక్షన్ కోసం ఢిల్లీలో సోమవారం నాడు సమావేశమైనటువంటి రోహిత్ శర్మ , కోచ్ రాహుల్ ద్రావిడ్,చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మొత్తం 17 మంది సభ్యులతో కూడినటువంటి టీం ఇండియా జట్టును ప్రకటించారు. అయితే ఈ టీంలో శిఖర్ ధావన్ కు ప్లస్ దొరక్క పోవడం క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేసింది. ఇంతకుముందు జరిగిన ఆసియా కప్ మ్యాచ్ చూసిన ఎవరికైనా శిఖర్ ధావన్ పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018 టోర్నమెంట్లో అతని ఆరిన 9 మ్యాచుల లో 2 హాఫ్ సెంచరీస్ తో పాటు 534 పరుగులు సాధించాడు.
ఇదే కాక మరెన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ఇటువంటి సీనియర్ ప్లేయర్ ను పక్కన పెట్టడం పై పలువురు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిగ్గా ఫిట్నెస్ కూడా లేని రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లను…. వన్డే సిరీస్ ఫార్మాట్ కు పెద్దగా సెట్ కాని సూర్య లాంటి ప్లేయర్స్ ను టీంలోకి తీసుకొని శిఖర్ ధావన్ లాంటి వ్యక్తిపై వేటు వేయడం సరికాదని .. అసలు బిసి చేయాలి తన సెలెక్షన్స్ ఏ బేసిస్పై చేస్తుందో తెలియటం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపద్యంలోచీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ చేసిన సంచలన వ్యాఖ్యలు అతని వన్డే కెరియర్ నే ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి. టీం ఇండియన్ ఓపెనర్గా ధావన్ అద్భుతమైన విజయాలను సాధించాడు.. అయితే ప్రస్తుతం ప్రెఫెర్డ్ ఓపెనర్స్ రోహిత్ శర్మ,ఇషాన్ కిషన్, శుభ్‌మాన్ గిల్ మాత్రమే అన్నట్లు అతను అనడం ఇక ధావన్ టీమ్ ఇండియా కెరీర్ కు తలుపులు మూసినట్లు అవుతుంది ఏమో అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకుముందులా కాపాడడానికి టీంలో ధోని కూడా లేడు…ఈ నేపథ్యంలో ఇక అతని కెరియర్ రిటైర్మెంట్ వైఫై పయనిస్తుందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది..
ఇక ఆసియా కప్లో పాల్గొనబోయే టీం వివరాలు విషయానికి వస్తే..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ
Web Title: Agarkar confirms shikhar dhawans indian team at the end of the road
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com