Subhaman Gill : రాహుల్ ద్రావిడ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఆ ఫార్మాట్లో చతేశ్వర్ పుజారా రాహుల్ ద్రావిడ్ వారసుడిగా పేరుగాంచాడు. అతడు కూడా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం లభించింది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు శనివారం నాటి రెండవ ఇన్నింగ్స్ లో శుభ్ మన్ గిల్ నయా వాల్ నేనేనని చెప్పేశాడు.. క్రీజ్ లో పాతుకుపోయి.. కొరకరాని కొయ్యలాగా మారి పరుగులు తీశాడు. నయా వాల్ లాగా ఆవిర్భవించాడు..
మూడో స్థానం అత్యంత కీలకం
భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో మూడో స్థానం అత్యంత కీలకమైనది.. ఓపెనర్లు తడబడినప్పుడు జట్టు ఇన్నింగ్స్ కు మూడో నంబర్ బ్యాటర్ చోదక శక్తి లాగా మారాలి. రివ్వున దూసుకు వచ్చే కొత్త బంతిని పాత బంతి లాగా మార్చాలి. అనంతరం వచ్చే ఆటగాళ్లకు పరుగులు చేసే అవకాశాన్ని కల్పించాలి. గతంలో ఈ బాధ్యతను రాహుల్ ద్రావిడ్, పూజార తమ బ్యాట్ స్కంధాలపై విజయవంతంగా మోసేవారు. అయితే ఆ తర్వాత ఆ బాధ్యతను గిల్ బ్యాట్ కు ఎత్తుకునేలాగా కనిపిస్తున్నాడు.
గట్టిగా సమాధానం చెప్పాడు
చిదంబరం మైదానంలో గిల్ చాలా ప్రశాంతంగా సెంచరీ చేశాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. రిషబ్ పంత్ (109) తో కలిసి అతడు జట్టు ఇన్నింగ్స్ ను పకడ్బందీగా నిర్మించాడు. స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట మెరిశాడు. అతడు జట్టు ఇన్నింగ్స్ పునర్నిర్మించిన తీరు రాహుల్ ద్రావిడ్, పుజారా ను గుర్తుకు తెచ్చింది. గిల్ ఒకప్పుడు ఓపెనర్ గా ఆడాడు. ఇప్పుడు మూడో స్థానంలో ఆడుతున్నాడు. అది ఒకరకంగా అతడికి ఇబ్బందే అయినప్పటికీ.. యశస్వి కోసం తన స్థానాన్ని ఇచ్చిన గిల్..”మూడో” నంబర్ లో స్థిరపడటంపై గట్టిగా నజర్ పెట్టాడు.
ఆపద్బాంధవుడయ్యాడు
ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో భారత్ టెస్ట్ సిరీస్ ఆడింది. అందులో గిల్ శతకం కొట్టాడు. ఇప్పుడు చెన్నైలోనూ మరోసారి ఆపద్బాంధవుడి అవతారం ఎత్తాడు. చిదంబరం మైదానంలో బంగ్లాదేశ్ బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. ఒకానొక దశలో టీమిండియా 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ గిల్ భయపడలేదు. తొలి ఇన్నింగ్స్ లో సున్నా పరుగులకే అవుట్ అయిన అతడు రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం స్పష్టత తో ఆడాడు. బంగ్లా జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. షాంటో ఎత్తులు వేసిన ప్రతిసారీ .. తనదైన ప్రణాళికతో వాటిని చిత్తు చేసేవాడు. అనితర సాధ్యమైన ఆత్మవిశ్వాసంతో.. అత్యంత ఖచ్చితత్వంతో షాట్లు ఆడాడు. స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు.
ఐదవ సెంచరీ
రెండవ ఇన్నింగ్స్ లో 33* పరుగులతో నాట్ అవుట్ గా ఉన్న గిల్.. మూడవరోజు రెట్టించిన ఉత్సాహంతో బ్యాటింగ్ చేశాడు. టెస్టులలో అజేయంగా 5వ సెంచరీ సాధించాడు. జట్టుకు తిరుగులేని ఆధిపత్యాన్ని అందించాడు. ఈ సెంచరీ ద్వారా జట్టులో మూడో స్థానం తనదే అని స్పష్టం చేశాడు.. ఇక ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలో గిల్ స్పష్టం చేయడం విశేషం..” ఇంగ్లాండ్ సిరీస్ నాలో తమ్ముల మార్పులకు కారణమైంది. మూడో స్థానంలో ఆడతాననే ధైర్యాన్ని నాలో నింపింది. నమ్మకాన్ని కూడా కలిగించిందని” గిల్ వ్యాఖ్యానించాడు.. ఇప్పటివరకు గిల్ 19 ఇన్నింగ్స్ లలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. తన కెరియర్ సగటు 37.46 కంటే ఉత్తమంగా అతడు 46.06 సగటుతో 737 రన్స్ చేశాడు.
&
Skilful Gill rose to the occasion with a superb TON
️ Relive his 5th Test Hundred #TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) September 21, 2024
;
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More