Asia Cup 2025 Afg Vs HK: “ఈ టోర్నీలో మేము అనామక జట్టుగా బరిలోకి దిగలేదు. మాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. వాటిని చేరుకోవడానికి కచ్చితంగా ప్రయత్నిస్తాం.. మా వంతుగా ప్రత్యర్థి జట్లకు గట్టి పోటీ ఇస్తాం. మా సత్తా ఏమిటో చూపిస్తాం” ఇదీ ఆసియా కప్ ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్ సారధి మాట్లాడిన మాటలు. అవి మాటలు కాదని.. చేతలు కూడా అలానే ఉంటాయని నిరూపించాడు ఆఫ్ఘనిస్తాన్ సారధి.
Also Read: ఒక్క పంచ్ తో సంజన నోరు మూయించిన సుమన్ శెట్టి..సైలెంట్ గా కనిపిస్తాడు కానీ!
ఆసియా కప్ లో భాగంగా హాంకాంగ్, ఆఫ్ఘనిస్తాన్ తలపడ్డాయి. ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేసింది. ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ ఓపెనర్లు విఫలమయ్యారు. దీంతో అటల్(73*), అజ్మతుల్లా ఓమర్జాయ్(53) విధ్వంసాన్ని సృష్టించగా, నబీ(33) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. హాంకాంగ్ బౌలర్లలో కించిత్ షా, ఆయుష్ శుక్లా చెరి రెండు వికెట్లు పడగొట్టారు. మూడు సులువైన క్యాచ్ లు హాంకాంగ్ ఫీల్డర్లు వదిలిపెట్టారు. ఇది మ్యాచ్ గతిని పూర్తిగా మార్చేసింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. ఆరు వికెట్ల కోల్పోయి 188 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన హాంకాంగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడినప్పటికీ తొమ్మిది వికెట్లు కోల్పోయి 94 పరుగులు మాత్రమే చేసింది. బాబర్ హయత్ (39), ముర్తాజ (16) మాత్రమే పరవాలేదనిపించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్ కు మాత్రమే పరిమితమయ్యారు. నైబ్ (2), ఫారూకీ(2) చెరి 2 వికెట్లు పడగొట్టారు. ఓమర్జాయ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలా ఒక వికెట్ పడగొట్టారు. హాంకాంగ్ ఇద్దరు బ్యాటర్లు రన్ అవుట్ అయ్యారు. ఈ విజయం ద్వారా ఆసియా కప్ ప్రయాణాన్ని ఆఫ్గనిస్తాన్ ఘనంగా మొదలుపెట్టింది.
ఈ మ్యాచ్లో హాంకాంగ్ గట్టి పోటీ ఇస్తుందని అందరూ అనుకున్నారు. బౌలింగ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లను వెంట వెంటనే అవుట్ చేయడంతో హాంకాంగ్ అద్భుతం చేసేలాగా కనిపించింది. అయితే అదే జోరును చివరి వరకు కొనసాగించలేకపోయింది. పైగా హాంకాంగ్ ఫీల్డర్లు మూడు క్యాచ్ లను నేలపాలు చేయడం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు కలిసి వచ్చింది. తద్వారా మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. ఇదే ఆఫ్ఘనిస్తాన్ గెలుపుకు.. హాంకాంగ్ ఓటమికి కారణమైంది.