Asia Cup 2022 Pak vs Afghanistan: అన్ని ఆటల్లోకంటే క్రికెట్లో అభిమానం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది. తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు గెలిచిన జట్టుపై దాడులు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పలు సందర్భాల్లో కొట్లాటలు జరిగాయి. ఆసియా కప్ లో భాగంగా బుధవారం షార్జాలో అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో హోరాహోరీగా పోరాడిన అఫ్గనిస్తాన్ చివరకు ఓటమి పాలైంది. దీంతో అభిమానులు పాకిస్తాన్ ప్రేక్షకులపై దాడి చేయడం సంచలనం కలిగించింది. చివరి ఓవర్లో పాకిస్తాన్ విజయం సాధించడంతో ఫ్యాన్స్ మధ్య దుమారం రేగింది.
ఓటమిని భరించుకోలేని అఫ్గనిస్తాన్ అభిమానులు స్టేడియంలో రచ్చ చేశారు. పాక్ అభిమానులను చితక్కొట్టారు. మ్యాచ్ అయిపోయాక రెండు దేశాల ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. ఇరుదేశాలకు చెందిన వారు పిడిగుద్దులు కురిపించారు. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. స్టేడియంలో కుర్చీలను విరగ్గొట్టారు. ఈ నేపథ్యంలో పాక్ కు చెందిన ఓ వ్యక్తిని కొడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అనంతరం అఫ్గనిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేశారు. స్టేడియంలోనే కాకుండా బయట కూడా ఇలా పరస్పరం దాడులు చేసుకోవడం ఆందోళన కలిగించింది. అందరిలో ఆశ్చర్యం కలిగించింది.
Also Read: Nagarjuna Vs Samantha: విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా హీరో నాగార్జున..! జనసేన అభ్యర్థిగా సమంత!?
దీనిపై సహజంగా విమర్శలు వస్తున్నాయి. అఫ్గన్ల జాత్యహంకారానికి ఇదే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అఫ్గన్ల తీరుపై పాక్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అఫ్గనిస్తాన్ తీరుపై అందరు విమర్శలు చేస్తున్నారు. ఆటలో ఎవరైనా తమ ప్రదర్శన చేసుకోవచ్చు కానీ ఇలా బయట దాడులకు తెగబడటం అనారికమని నెటిజన్లు సైతం పోస్టులు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇవి ట్రోలింగ్ అవుతున్నాయి.
ఈ మ్యాచ్ లో అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా పాక్ పేస్ బౌలర్ నసీమ్ షా రెండు సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. దీంతో అఫ్గనిస్తాన్ ప్రజల్లో ఆగ్రహం పెరిగి దాడుల వరకు వెళ్లడం గమనార్హం. ఆటలో ఎవరైనా తమ బలం ప్రదర్శించవచ్చు. కానీ ఇలా బయట ఉన్న వారు దాడులు చేయడం నిజంగా ఆటవికమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read:Puri Jagannath: లైగర్ ఎఫెక్ట్ : అద్దె కట్టలేక ముంబైలో ఫ్లాట్ ఖాళీ చేస్తున్న పూరి జగన్నాథ్..