Rohit Sharma And Adam Gilchrist: ఒకప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ బ్యాటింగ్ భారాన్ని మోసాడు వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్. అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా 2003లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీం ఇండియా పై అద్భుతంగా బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. ఆ సంవత్సరం టీమిండియా వన్డే వరల్డ్ కప్ కోల్పోవడానికి ప్రధాన కారణమయ్యాడు.. అటువంటి ఆటగాడు ఇప్పుడు అకస్మాత్తుగా వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.
Also Read: డీసీపీ పైనే కత్తితో దాడి.. చాదర్ ఘాట్ ఘటనలో.. వెలుగులోకి సంచలన నిజం..
గిల్ క్రిస్ట్ ఆస్ట్రేలియా క్రికెట్ నుంచి తప్పుకుని చాలా రోజులైంది. వ్యాఖ్యాతగా.. క్రికెట్ కు సంబంధించిన ఇతర వ్యవహారాలలో అతడు ప్రముఖంగా కనిపిస్తున్నాడు. అయితే ఇటీవల అతని సంబంధించిన ఒక విషయం వెలుగులోకి వచ్చింది. దానికి ప్రధాన కారణం రోహిత్ శర్మనే. రోహిత్ శర్మ గిల్ క్రిస్ట్ కెరియర్ చరమాంకంలో ఉన్నప్పుడు క్రికెట్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత రోహిత్ అద్భుతమైన ఆటగాడిగా రూపాంతరం చెందాడు. ఆ తర్వాత టీమ్ ఇండియాకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నాడు. టీమిండియాకు టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ లు అందించిన నాయకుడిగా రికార్డ్ సృష్టించాడు.
సోషల్ మీడియాలో రోహిత్ శర్మకు విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. ప్రాంతాలతో సంబంధం లేకుండా చాలామంది రోహిత్ శర్మను అభిమానిస్తుంటారు. సోషల్ మీడియాలో ఆయనకు లక్షలలో అభిమానులు ఉన్నారు. రోహిత్ ఒక పోస్ట్ చేస్తే చాలు సోషల్ మీడియాలో అది ప్రకంపనలు సృష్టిస్తుంది. అటువంటి రోహిత్ ఇప్పుడు గిల్ క్రిస్ట్ కు అనుకోని వరం ఇచ్చాడు.
ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ కోసం కంగారు గడ్డమీద అడుగు పెట్టాడు రోహిత్ శర్మ. తొలి వన్డేలో విఫలమైనప్పటికీ.. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ చేశాడు. మూడో వన్డేలో సెంచరీ చేశాడు. అంతేకాదు ఏకంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. అటువంటి రోహిత్ శర్మ గిల్ క్రిస్ట్ తో ఒక ఫోటో దిగాడు. అంతేకాదు వారిద్దరూ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను గిల్ క్రిస్ట్ తన అధికారిక సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో రోహిత్ అభిమానులు గిల్ క్రిస్ట్ ను అనుసరించడం మొదలుపెట్టారు. రోహిత్ శర్మతో దిగిన ఫోటోలను గిల్ క్రిస్ట్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో.. ఒక్కసారిగా ఫాలోవర్ సంఖ్య పెరిగిపోయింది. ఒక రోజులోనే అతడిని 24 వేల మంది అనుసరించడం మొదలుపెట్టారు.. ఈ విషయం వైరల్ గా మారడంతో.. రోహిత్ శర్మ మేనియా మరోసారి ప్రపంచానికి అర్థం అయిపోయింది. కాగా, గిల్ క్రిస్ట్ ను ఇంస్టాగ్రామ్ లో 8 లక్షలకు పైగా నెటిజన్లు అనుసరిస్తున్నారు.
View this post on Instagram