https://oktelugu.com/

Ind Vs SA టీమిండియా కెప్టెన్సీ మార్పు: కేఎల్ రాహుల్ ను తప్పించారా? రిషబ్ పంత్ ను పరీక్షిస్తున్నారా?

Ind Vs SA  ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరుగబోతోంది. ఆ ప్రతిష్టాత్మక కప్ కు ముందు జరిగే సిరీస్ లు అన్నీ కీలకమే. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికాతో 5 టీ20ల సిరీస్ కు రంగం సిద్ధమైంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతినిచ్చి యువ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా నియమించింది. అయితే సడెన్ గా ప్రాక్టీస్ సెషన్ లో కేఏల్ రాహుల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 8, 2022 8:31 pm
    Follow us on

    Ind Vs SA  ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరుగబోతోంది. ఆ ప్రతిష్టాత్మక కప్ కు ముందు జరిగే సిరీస్ లు అన్నీ కీలకమే. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికాతో 5 టీ20ల సిరీస్ కు రంగం సిద్ధమైంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతినిచ్చి యువ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా నియమించింది.

    అయితే సడెన్ గా ప్రాక్టీస్ సెషన్ లో కేఏల్ రాహుల్ తీవ్రంగా గాయపడ్డారని.. అందుకే అతడు వైదొలిగాడని బీసీసీఐ ప్రకటన చేసింది. అతడితోపాటు కుల్దీప్ యాదవ్ కూడా గాయపడి జట్టు నుంచి దూరమయ్యాడని తెలిపింది.

    నిజానికి సీనియర్ల గైర్హాజరులో మూడు ఫార్మాట్లలో విలువైన ఆటగాడు కేఎల్ రాహుల్. కానీ అతడి నాయకత్వ సామర్థ్యాలు మాత్రం అంతగా వర్కవుట్ కాలేదు. గత ఏడాది దక్షిణాఫ్రికాతో సిరీస్ కు టీమిండియా జట్టును కేఎల్ రాహుల్ సారథ్యంలో పంపిస్తే మూడు మ్యాచుల్లోనూ ఓడి అతడి కెప్టెన్సీపై అపనమ్మకం కలిగేలా చేసింది. ఇక ఐపీఎల్ లోనూ లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ గా.. అంతకుముందు పంజాబ్ కెప్టెన్ గా రాహుల్ విఫలమయ్యారు. వాటికి కప్ ను అందించలేకపోయాడు.

    ఇప్పుడు దక్షిణాఫ్రికా సిరీస్ కు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ కు చివరి అవకాశం అని అనుకున్నారు. కానీ సడెన్ గా అతడికి గాయమని చెప్పి పక్కకు తప్పించడం చర్చనీయాంశమైంది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో విఫలమయ్యాడు. అందుకే ఈసారి అతడికి ప్రత్యామ్మాయంగా రిషబ్ పంత్ ను పరీక్షించే యోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. ఇతడికి వైఎస్ కెప్టెన్ గా ఐపీఎల్ లో విజయవంతమైన హార్ధిక్ పాండ్యాను నియమించారు.

    సో కేఎల్ రాహుల్ ఆల్ రెడీ కెప్టెన్సీలో విఫలమయ్యాడు. ఇప్పుడు రిషబ్ పంత్ కు ఇదో అవకాశం. అతడి కెప్టెన్సీలో జట్టు ఆడితే భవిష్యత్ కెప్టెన్ అవుతాడు. ఆడకుంటే మాత్రం కేఎల్ రాహుల్ లాగానే పంత్ సైతం ఫ్లాప్ అయ్యి కెప్టెన్సీ కోల్పోతాడు. ఇక నిరూపించుకున్న హార్ధిక్ పాండ్యాను భవిష్యత్ భారత కెప్టెన్ గా చూడొచ్చు. ఏం జరుగుతుందన్నది ఈ దక్షిణాఫ్రికా సిరీస్ తేల్చబోతోంది.