IND Vs END T20 Match : మరో 20 రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) ప్రారంభం కానుంది. పాకిస్తాన్ వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. భారత్ మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదికగా జరుగుతాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20 మ్యాచ్‌లు జనవరి 22న ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) అద్భుతంగా ఆడాడు. 34 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. అయితే తాజాగా రెండో టీ20 శనివారం(జనవరి 25న) జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉనన భారత్‌కు ఇప్పుడు తుది జట్టు ఎంపిక ఓ సమస్యగా మారింది. పేసర్ మహ్మద్ షమీని ఆడిస్తారా లేదా.. అనేది తేలాల్సి ఉంది. ఈ క్రమంలో ఓ వార్త అభిమానులకు షాక్‌కు గురిచేసింది. తొలి మ్యాచ్‌లో దూకుడైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన అభిషేక్ శర్మ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు.
ప్రాక్టీస్ సషన్‌లో గాయం…
చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ సందర్భంగా అభిషేక్ గాయపడ్డాడు. చీలమండలం గాయంతో అతను బాధపడినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన చేయలేదు. ఇదే నిజమైతే రెండో టీ20కి అభిషేక్ దూరం అయ్యే అవకాశం ఉంది. దీంఓ ఓపెనరర్‌గా సంజూ శాంసన్(Sanju samsan) వస్తాడని తెలుస్తోంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఓపెనర్‌గా రావొచ్చని సమాచారం.
షమీ పరిస్తితి ఏంటి?
రెంటో టీ20లో షమీ ఆడడం ఖాయమే అన్న వార్తలు వస్తున్నాయి. తొలి టీ20లో తుది జట్టులో స్థానం దక్కించుకన్న నితీశ్‌రెడ్డి బ్యాటింగ్, బౌలింగ్ చేయలేదు. అతడి స్థానంలో మహ్మద్ షమీ(Mahmad Shami)ని ఆడిస్తారని తెలుస్తోంది. అభిషేక్‌కు గాయం నిజమే అయితే మాత్రం తుది జట్టులో షమీ, నితీశ్ ఇద్దరూ ఉండేఅవకాశం ఉంది. కొత్త బంతితో హార్దిక్ భారీగా పరుగులు ఇచ్చాడు. దీంతో అర్షదీప్‌తో కలిసి తొలి స్పెల్‌ను షమీ వేస్తే ఇంగ్లండ్‌ను మరింత కట్టడి చేయవచ్చన్న అభిప్రాయంతో టీం మేనేజ్‌మెంట్ ఉంది.
స్పిన్ పిచ్..
ఇదిలా ఉంటే చెప్కా స్టేడియం స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. దీంతో నితీశ్‌ను పక్కనపెట్టి వాషింగ్‌టన్ సుందర్‌ను ఆడిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తునానరు. అలా అయితే అదనంగా బ్యాటర్ కూడా జట్టులో ఉన్నట్లు ఉంటుంది. మరోవైపు బ్యాటింగ్ కూడా అవసరమే. సుందర్‌తో నితీశ్‌ను కూడా తుది జట్టులోకి తీసుకుంటే ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్లు అందుబాటులో ఉంటారు. అప్పుడు రవి బిష్ణోయ్‌ను తప్పించే అవకాశం ఉంటుంది.
రికార్డుకు చేరువలో అర్షదీప్..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వంద వికెట్లు తీసిన అర్షదీప్ సింగ్‌కు మరో మూడు వికెట్లు అవసరం. అతను ఈ ఘటన సాధిస్తే భారత్ తరఫున వంద వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలుస్తాడు. ఇప్పటికే టీ20ల్లో భారత్ టాప్ వికెట్ టేకర్(97)గా ఉన్నాడు. అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకోవడానికి రెంటో టీ20లో మూడు వికెట్ల పడగొట్టాలి. దీంతో ప్రపంచంలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ బౌలర్ హారిస్ రవూఫ్(71 మ్యాచ్‌లలో) ఉంది. మరో వైపు అర్షదీప్ 61 మ్యాచ్‌ల్లోనే 97 వికెట్లు పడగొట్టాడు.
తుది జట్టు (అంచనా)
సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, నితీశ్‌కుమార్‌రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్/రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ.