AB De Villiers: ఏబి డివిలియర్స్.. క్రికెట్ లో ఈ పేరు తెలియని వారు ఉండరు. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డివిలియర్స్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. స్టేడియం నలుమూలల షాట్లు కొట్టగల సామర్థ్యం డివిలియర్స్ సొంతం. అందుకే ఏబిని మిస్టర్ 360 డిగ్రీస్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటుంటారు. అంతర్జాతీయ క్రికెట్ కు డివిలియర్స్ దూరమై చాలా ఏళ్లు అవుతున్నప్పటికీ.. అతనిని అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు. తాజాగా డివిలియర్స్ 2015లో చోటు చేసుకున్న ఒక విషయం గురించి బయటపెట్టగా అభిమానులు దాని గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
దక్షిణాఫ్రికా రిటైర్డ్ క్రికెటర్ ఏబి డివిలియర్స్ 2015 వరల్డ్ కప్ లో జరిగిన ఒక మ్యాచ్ కు సంబంధించిన విషయాన్ని తాజాగా పంచుకున్నాడు. వెస్టిండీస్ తో మ్యాచ్ సందర్భంగా డివిలియర్స్ ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితిని ఎనిమిది ఏళ్ల తర్వాత బయట పెట్టాడు డివిలియర్స్. ఆ విషయం ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డివిలియర్స్ షేర్ చేసిన నాటి విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు ఆసక్తిని కలిగించాయి. డివిలియర్స్ తెలియజేసిన విషయం గురించి తెలుసుకున్న అభిమానులు.. దటీజ్ ఏబి అంటూ కొనియాడుతున్నారు. డివిలియర్స్ షేర్ చేసిన విషయం ఏంటో మీరు ఒకసారి చదివేయండి.
తీవ్రమైన జ్వరంతో బాధపడిన ఏబి.. అయినా అద్భుత ప్రదర్శన..
2015 వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్ తో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకము కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఈ మ్యాచ్ కు కొద్ది నిమిషాలు ముందు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఏబి డివిలియర్స్ తీవ్రమైన జ్వరంతో బాధపడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా డివిలియర్సే తాజాగా బయటపెట్టాడు. నాటి విషయం గురించి స్పందిస్తూ.. ‘ వెస్టిండీస్ తో మ్యాచ్ జరిగినప్పుడు నేను చాలా భయపడ్డాను. తెల్లవారుజామున 3 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాను. జ్వరం తగ్గేందుకు ఇంజక్షన్లు తీసుకుని అన్ని వస్తువులను సిద్ధంగా ఉంచుకున్నాను’ అని డివిలియర్స్ నాటి విషయాన్ని బయట పెట్టాడు. తీవ్రమైన జ్వరంతో బరిలోకి దిగిన డివిలియర్స్ ఆ రోజు మ్యాచ్లో 66 బంతుల్లోనే 162 పరుగులు చేసి జట్టు విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. జియో సినిమా హోం ఆఫ్ హీరోస్ షోలో మాట్లాడిన డివిలియర్స్ నాటి విషయాలను బయట పెట్టాడు. తీవ్రమైన జ్వరం వల్ల రాత్రంతా నిద్ర లేదని, నా బ్యాటింగ్ రాగానే బెడ్ మీద నుంచి లేచి మైదానంలోకి నేరుగా అడుగు పెట్టినట్లు వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ తో 17 ఫోర్లు, 8 సిక్సలు సహా 162 పరుగులు చేసిన డివిలియర్స్ వన్డేల్లో వేగంగా 150 పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఇక ఆ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు 257 పరుగులు తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా జట్టు 5 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది.