Gautam Gambhir: ఆడుతున్నది టెస్ట్ మ్యాచ్.. అదీ సొంత దేశంలో లక్ష్యం ఛేదించకపోయినా కొంపలు మునిగేది ఏమీ లేదు.. వికెట్ల వద్ద పాతుకుపోయినా అడేగేవారు లేరు. కావాల్సింది కూడా వికెట్లు పడకుండా అడ్డు కోవడమే. కానీ ఈ మాత్రం ఇంగిత జ్ఞానం భారత క్రికెట్ జట్టులో ఒక్క క్రికెటర్‌కు కూడా లేకుండా పోయింది. ఇక కోచ్ గంభీర్‌కు ఆమాత్రం అవగాహన కూడా లేదు. ఈయన అసలు కోచ్ బాధ్యతలు నిర్వర్సిన్నారా లేక గల్లీలో క్రికెట్ జట్టును తయారు చేస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది. ఎందుకంటే సౌల్ ఆఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ఇన్నింగ్ చూస్తుంటే. భారత జట్టు బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో, ఫీల్డింగ్‌లో చివరకు కోచింగ్‌లో కూడా పూర్తిగా విఫలమైంది. గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 140 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా మినహా ఎవరూ గెలుపు కాదు.. కనీసం డ్రా కోసం కూడా ఆడలేదు. దీంతో డబ్ల్యూటీసీ అర్హతలో శుభారంభం చేయాలన్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి.
చాలా నేర్చుకోవాల్సింది..
టీమిండియా చిన్న జట్టు కాదు.. కొత్తగా క్రికెట్ ఆడడం లేదు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. అయినా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండింటిలో ఓడి వైట్‌వాష్ చేసుకుంది. రెండో టెస్టు డ్రా చేసుకునే అవకాశం ఉన్నా భారత్ ఆటగాళ్లు మైదానంలో ఎందుకు పెవిలియన్‌లో కూర్చుందాం అన్నట్లుగా ఇలా వచ్చి అలా వెళ్లారు. జడేజా 54 పరుగులు చేశాడు. సౌత్ ఆఫ్రికాలో సైమన్, కేశవ్, ముత్తుసామి, మార్కో వంటి సౌతాఫ్రికా బౌలర్ల వారు కీలక వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీశారు.
ఇంకా ప్రయోగాలు చేస్తున్న గంభీర్..
గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తోంది. కానీ ఆయన వ్యవహార శైలి.. ఆయన చేస్తున్న ప్రయోగాలు.. టీం సభ్యులతో ఆయనకు ఉన్న కోఆర్డినేషన్‌పై చాలా సందేహాలు ఉన్నాయి. మోనార్క్‌లా గంభీర్ వ్యవహరిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. మొదటి నుంచి కోచ్ ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా కీలక మ్యాచ్‌లో కూడా ప్రయోగాలతో విమర్శలపాలయ్యారు. తాను టీమిండియాకు కోచ్ అన్న విషయం మర్చిపోయి.. ఏదో గల్లీ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాను అన్నట్లుగా బ్యాట్స్‌మెన్‌ల స్థానాలు మార్చడం.. క్రీడాకారుల మధ్య సమన్వయం తీసుకురావడంలో గంభీర్ విఫలమయ్యాడు. దీంతో భారత క్రికెట్ అభిమానులు గంభీర్ నీకో దండం.. ఇక నీ ప్రయోగాలన్నా ఆపు.. లేదా కోచ్ బాధ్యతల నుంచి అయినా తప్పుకో అని చేతులు జోడించి కోరుతున్నారు.
హోం అడ్వాంటేజ్‌ను వినియోగించుకోని జట్టు..
ఇక టీమిండియా ఆటగాళ్లను చూస్తే గల్లీ మ్యాచ్ ఆడుతున్నట్లుగా కనిపించింది. ఒక్క క్రికెటర్ కూడా సౌత్ ఆఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనలేదు. హోం గ్రౌండ్‌లో టీమిండియా క్రికెటర్లను టైగర్‌తో పోలుస్తారు. కానీ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ చూసిన తర్వాత పులులు కాదు.. చివరకు పిల్లులు కూడా కాదు అన్నట్లుగా కనిపించింది. ఒక్క ఆటగాడికి కూడా బాధ్యతగా ఆడాలన్న కాన్ఫిడెన్స్ కనిపించలేదు. హోం గ్రౌండ్‌ను ఒక్కరు కూడా వినియోగించుకోలేద. మొదటి టెస్టు ఈడెన్ గార్డెన్‌లో కూడా ఇదే పరిస్థితి. బ్యాట్స్‌మెన్స్ మాత్రమే కాదు.. బౌలర్లు కూడా విఫలమయ్యారు. బుమ్రా, సిరాజ్, జడేజా, కుల్దీప్, సుందర్, జైశ్వాల్, నితీశ్‌రెడ్డి.. ఇలా అందరూ బౌలింగ్ చేశారు. కానీ సౌత్‌ఆఫ్రికాను కట్టడి చేయలేదు. దీంతో టీమిండియా అభిమానులు మన క్రికెటర్లకు కూడా దండం పెట్టి వేడుకుంటున్నారు.
సఫారీ జట్టు అగ్రగామిగా ఎదుగుదల..
సౌతాఫ్రికా దారుణ విజయంతో 2–0తో సిరీస్ను క్లీన్‌స్వీప్ చేయడంతో, వారి ప్రదర్శన ప్రశంసలు అందుకుంటోంది. గతంలో ఎన్నడూ సౌత్‌ఆఫ్రికా భారత్‌ను భారత్‌లో క్లీన్ స్వీప్ చేయలేదు. భారత జట్టు ప్రస్తుత స్థాయిలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ విఫలమైంది.
ఈ పరిస్థితి టీమిండియా ఆటగాళ్ల మానసిక, భౌతిక శక్తుల పునర్రూపకల్పనకు ప్రేరణగా ఉండాలని సూచిస్తోంది. జట్టు వ్యవస్థలను పునర్నిర్మించుకొని, ఆటగాళ్ల శిక్షణ, సమన్వయంపై ఎక్కువ దృష్టి పెట్టక తప్పదు.