Kolkata Knight Riders: ఐపీఎల్ లో.. అత్యంత డేంజరస్ జట్టుగా కోల్ కతా నైట్ రైడర్స్ కు పేరుంది. షారుక్ ఖాన్ ఈ జట్టుకు యజమాని. ఈ జట్టు 2024 సీజన్లో విజేతగా నిలిచింది. అంతకంటే ముందు గౌతమ్ గంభీర్ నాయకత్వంలో కోల్ కతా ఐపీఎల్ విజేతగా నిలిచింది. కోల్ కతా ఎప్పటికప్పుడు వైవిధ్య భరితమైన ఆటతీరుతో ఆకట్టుకుంటుంది. గడచిన సీజన్లో మాత్రం కోల్ కతా అంతగా ఆడలేదు. పైగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఈ జట్టు.. విఫలమైంది. స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ సత్తా చూపించలేకపోయింది.
త్వరలో ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలం జరగనుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆయా జట్లు రిటైన్, రిలీజ్ ప్రక్రియను ముగించాయి. వాస్తవానికి దీనిని కోల్ కతా నైట్ రైడర్స్ ముందు ప్రారంభించింది.. జట్టు ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది.. భీకరమైన ప్లేయర్లను కూడా వదిలించుకుంది.. గతంలో 23 కోట్లతో కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్ అనే ప్లేయర్ ను కోల్ కతా యాజమాన్యం రిలీజ్ చేసింది. దీనిని బట్టి ఆ జట్టు గేమ్ ప్లాన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఏకంగా ప్రమాదకరమైన రసెల్, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డికాక్, మయాంక్ మార్కండే, స్పెన్సర్ జాన్సన్, నోర్జ్ వంటి ప్లేయర్లను వదిలేసుకుంది. వాస్తవానికి వీరంతా కూడా భీకరమైన ప్లేయర్లు. కోల్ కతా గతిని మార్చేసే ఆటగాళ్లు. అటువంటి ప్లేయర్లను మేనేజ్మెంట్ వదిలేసుకుంది అంటే మామూలు విషయం కాదు. పైగా ఈ జట్టు పర్సు వేల్యూ ఏకంగా 64.3 కోట్ల వరకు ఉంది. దీనినిబట్టి ఈ జట్టు తదుపరి ప్లాన్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మినీ వేలంలో యంగ్ ప్లేయర్లను తీసుకోవాలని ఈ జట్టు భావిస్తోంది. అందువల్లే కీలకమైన ప్లేయర్లను వదిలేసుకుంది. సీనియర్ ప్లేయర్లు కొంతకాలంగా ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నారు.. ఈ నేపథ్యంలో వారిని పక్కన పెట్టి.. ఆ స్థానంలో కొత్త ప్లేయర్లను తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.. కొత్త ప్లేయర్లను తీసుకొని.. వారికి సరైన స్థాయిలో శిక్షణ ఇచ్చి.. జట్టు అవసరాలకు తగ్గట్టుగా మలచుకోవాలని మేనేజ్మెంట్ ఆలోచన గా ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
గౌతమ్ గంభీర్ నాయకత్వంలో కోల్ కతా విజేతగా నిలిచినప్పుడు మేనేజ్మెంట్ ఇదే సూత్రాన్ని అవలంబించింది.. 2026 సీజన్ లో కూడా ఇదే విధానాన్ని అమలు చేసి విజేతగా నిలవాలని మేనేజ్మెంట్ నిర్ణయంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అయిందని.. భారీగా ఉన్న పర్సు వేల్యూ ద్వారా మంచి మంచి ప్లేయర్లను కొనుగోలు చేసి.. వారికి అవకాశాలు ఇచ్చి.. ఆడించాలనేది కోల్ కతా యాజమాన్యం లక్ష్యంగా ఉంది..
గౌతమ్ గంభీర్ టీం మీడియా కోచ్ అయిన తర్వాత బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ శిక్షణ విభాగంలో కోల్ కతా యాజమాన్యం సమూలంగా మార్పులు తీసుకొచ్చింది.. కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చింది.. తద్వారా 2025 సీజన్ లోనూ దుమ్మురేపాలని కోల్ కతా యాజమాన్యం భావించింది. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు సీనియర్ ప్లేయర్లను మొత్తం మేనేజ్మెంట్ బయటికి పంపించింది. కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తోంది. ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? జట్టును 2026లో విజేతగా చేస్తుందా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.