https://oktelugu.com/

టీ20 ప్రపంచకప్ పై తేల్చేసిన సౌరవ్ గంగూలీ

కరోనా కల్లోలంతో భారత్ లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మెగా టోర్నీ ఈ శీతాకాలంలో భారత్ లో జరగాల్సి ఉండేది.కానీ తర్జన భర్జనల తర్వాత దేశంలో ఈ మెగా టోర్నీ జరగదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తేల్చేశారు. కరోనా మహమ్మరి ఐపీఎల్ పై పంజా విసిరింది. ఎంత పకడ్బందీగా బయోబబూల్ ఏర్పాటు చేసినా.. ఆటగాళ్లను నిర్బంధం చేసినా కూడా కరోనా సెకండ్ వేవ్ వేళ ఈ మహమ్మారి వ్యాపించింది. ఆటగాళ్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 28, 2021 / 07:54 PM IST
    Follow us on

    కరోనా కల్లోలంతో భారత్ లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మెగా టోర్నీ ఈ శీతాకాలంలో భారత్ లో జరగాల్సి ఉండేది.కానీ తర్జన భర్జనల తర్వాత దేశంలో ఈ మెగా టోర్నీ జరగదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తేల్చేశారు.

    కరోనా మహమ్మరి ఐపీఎల్ పై పంజా విసిరింది. ఎంత పకడ్బందీగా బయోబబూల్ ఏర్పాటు చేసినా.. ఆటగాళ్లను నిర్బంధం చేసినా కూడా కరోనా సెకండ్ వేవ్ వేళ ఈ మహమ్మారి వ్యాపించింది. ఆటగాళ్లు కరోనా బారినపడడంతో ఐపీఎల్ ను వాయిదా వేయాల్సి వచ్చింది..

    ఆగిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ ను మళ్లీ పట్టాలెక్కించింది బీసీసీఐ. మిగిలిన 31 మ్యాచ్ లను ఎలాగైనా పూర్తి చేయాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది. అయితే ఈ మ్యాచ్ లు ఇండియాలో కాదు.. యూఏఈలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

    సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 10లోపు ఐపీఎల్ ను యూఏఈలో పూర్తి చేయాలని చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ దీనిపై ఇటీవలే ప్రకటన చేసింది. తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 19న టోర్నీని తిరిగి ప్రారంభించి.. అక్టోబర్ 15న ఫైనల్ తో ముగించాలని భావిస్తున్నట్టు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ మేరకు యూఏఈ క్రికెట్ బోర్డు నిర్వామకులు, అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.

    ఇక ఐసీసీ టీ20 ప్రపంచకప్ పై కూడా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మెగా టోర్నీని యూఏఈకి తరలిస్తున్నామని అధికారికంగా ప్రకటించింది. కోవిడ్19 ముప్పు, ఆరోగ్యం, సంక్షేమ కారణాల వల్ల టీ20 ప్రపంచకప్ వేదికను మార్పు చేయక తప్పడం లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. ఈ మేరకు ఐసీసీకి అధికారికంగా తెలియజేశామన్నారు. త్వరలోనే షెడ్యూల్ పై వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ -నవంబర్ లో ఈ మెగా టోర్నీ జరుగబోతోంది.