Karva Chauth: కర్వా చౌత్ ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రత్యేకత ఏంటి?

కర్వా చౌత్‌ పండుగను మహిళలే ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రత్యేకత ఏంటి? చంద్రుడికి అర్ఘ్యం ఎందుకు సమర్పిస్తారు? ఇలా సమర్పించిన తర్వాతే ఎందుకు ఉపవాసాన్ని విరమిస్తారు? అసలు ఈ ఏడాది కర్వా చౌత్ పండుగను ఎప్పుడు? ఎలా జరుపుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 18, 2024 11:20 pm

karwa chavth

Follow us on

Karva Chauth: హిందూ పండుగల్లో కర్వా చౌత్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ పండుగను స్త్రీలు ఆచరిస్తారు. దక్షిణ భారత దేశంలో కంటే ఉత్తర భారత దేశంలో ఎక్కువగా ఈ పూజను ఆచరిస్తారు. అయితే తమ భర్త దీర్ఘాయువుతో ఉండాలని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ పండుగ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, రాత్రికి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి.. ఆ తర్వాత పూజను విరమిస్తారు. ఇలా చేయడం వల్ల భర్త ఆయురోగ్యాలతో ఉంటారని నమ్ముతారు. ఈ పండుగను ప్రతి ఏడాది దీపావళికి ముందు జరుపుకుంటారు. అయితే ఈ కర్వా చౌత్‌ పండుగను మహిళలే ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రత్యేకత ఏంటి? చంద్రుడికి అర్ఘ్యం ఎందుకు సమర్పిస్తారు? ఇలా సమర్పించిన తర్వాతే ఎందుకు ఉపవాసాన్ని విరమిస్తారు? అసలు ఈ ఏడాది కర్వా చౌత్ పండుగను ఎప్పుడు? ఎలా జరుపుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

 

హిందూ సంప్రదాయం పాటించే మహిళలు తప్పకుండా కర్వా చౌత్ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది కర్వా చౌత్‌ను అక్టోబర్ 20వ తేదీన భక్తితో పూజిస్తారు. తమ భర్త క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పూజిస్తూ కర్వా చౌత్ రోజు ఉపవాసం ఉంటారు. రాత్రి పూట చంద్రునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఉపవాసాన్ని విడిచి పెడతారు. చంద్రుని వెలుగులో జల్లేడలో తన భర్త ముఖాన్ని చూసి ఆ తర్వాత జల అర్ఘ్యాన్ని చంద్రునికి సమర్పించి ఉపవాసం వదలుతారు. అయితే ఈ అర్ఘ్యాన్ని కేవలం మట్టి కుండల్లో మాత్రమే ఇస్తారు. మిగతా ఎలాంటి కుండలను ఉపయోగించరు. ఎందుకంటే నేల, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాలతో ఈ మట్టి కుండను తయారు చేస్తారు. అలాగే మానవ శరీరం కూడా ఇలానే ఏర్పడింది. అయితే మట్టి కుండను తయారు చేసేటప్పుడు మొదటగా నీటిలో నానబెట్టి దానితో కుండ చేస్తారు. ఆ తర్వాత గాలి, సూర్యరశ్మి ద్వారా ఎండుతుంది. ఆ తర్వాత నిప్పులో వండుతారు. ఇలా కుండ తయారు అవుతుందని, దీన్ని స్వచ్ఛతకు చిహ్నంగా ఈ మట్టి కుండలో ఇస్తారు.

 

సావిత్రి అనే మహిళ భర్త సత్యవాన్ చనిపోతే తన బ్రతికించాలని దేవుడును యమను కోరుకుంటుంది. తన భర్త బతికే వరకు పూర్తిగా తినడం, తాగడం మానేస్తుంది. తన భర్త మళ్లీ బతికితే చాలు ఇంకేం వద్దని యమను కోరుతుంది. దీంతో యమ అతని భర్త సత్యవాన్‌ను బతికిస్తాడు. ఇలా చేయడం ఉపవాసం ఉండి భర్తను పూజించడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని నమ్ముతారు. పూజ పూర్తయిన తర్వాత చంద్రుని పూజించి ఉపవాసాన్ని విరమిస్తారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. మరికొన్ని పురాణాలు ఏం చెబుతున్నాయంటే చంద్రుని పూజించకుండా మహిళలు భోజనం చేస్తే భర్త ఆయుష్షుకు భంగం కలుగుతుందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు పండితుల సలహాలు తీసుకోగలరు.