Vaikuntha Ekadashi 2025: మార్గశిర మాసంలో శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ మాసంలో ఆ స్వామి అనుగ్రహం పొందడం వల్ల జీవితంలో అన్నీ సంతోషాలే ఉంటాయని భక్తుల నమ్మకం. అందువల్ల ఈ మాసంలో కొందరు విష్ణువును ప్రత్యేకంగా కొలుస్తారు. అంతేకాకుండా మార్గశిర మాసంలోనే గోదాదేవి కల్యాణం, వైకుంఠ ఏకాదశి అనే పర్వదినాలు వస్తాయి. వీటిలో వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు వైష్ణవాలయాలు సందర్శించి స్వామి అనుగ్రహం పొందాలను చూస్తారు. ఈరోజున విష్ణువును దర్శించుకోవడం వల్ల వైకుంఠం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతారు. అందువల్ల వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మకాలం నుంచే స్వామి దర్శనానికి భక్తులు క్యూ కడుతారు. ప్రముఖ ఆలయాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకొని భక్తులను ఆహ్వానిస్తారు. అయితే వైకుంఠ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..
తెలుగు పంచాంగం ప్రకారం 2025లో వైకుంఠ ఏకాదశి జనవరి 10న వచ్చింది. ఈరోజున వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. ఇందులో భాగంగా ఆలయ నిర్వాహకులు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లు చేశారు. ఈరోజు స్వామి వారిని దర్శించుకోవాలని భక్తులు ఇప్పటికే ఆలయాల్లో క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. నేటి కాలం వారు వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకోవాలని తమ పెద్దలను అడుగుతున్నారు.
పురాణాల ప్రకారం.. వైకుంఠ ఏకాదశకి ఓ కథ ఉంది. పూర్వ కాలంలో ముర అనే రాక్షసుడు ఉండేవారు. ఈ రాక్షసుడి చేత ప్రజలు పీడింపబడ్డారు. దీంతో తమకు ముర రాక్షసుడి నుంచి విముక్తి కలిగించాలని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల బాధలను తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు ముర అనే రాక్షసుడిని సంహరించాలని అనుకున్నాడు. ఇందులో భాగంగా ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తాడు. ఇదే క్రమంలో శ్రీ మహావిష్ణువు సింహవతి అనే గుహలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ స్వామి శక్తి నుంచి ఏకాదశి అనే స్త్రీ ఉద్భవిస్తుంది. ఈ స్త్రీనే ముర అనే రాక్షసుడిని సంహరిస్తుంది.
ఏకాదశి చేసిన పనికి మహావిష్ణువు సంతోషిస్తాడు. దీంతో ఏం వరం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దీంతో ఆమె ఉపవాసం ఉన్న వారికి మోక్షం కలిగించాలని అంటుంది. దీంతో స్వామి ఏకాదశికి ఆ వరం ఇస్తాడు. అయితే ఇది జరిగిన రోజే వైకుంఠ ఏకాదశని నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున పవిత్రంగా ఉంటూ ఉపవాసం చేయడం వల్ల అన్నీ శభాలే జరుగుతాయని జాతక చక్రం తెలుపుతుంది. అంతేకాకుండా ఈరోజున బ్రహ్మకాలంలోనే లేచి స్నానమాచరించి పరిశుభ్రమైన దుస్తులు ధరించి వైష్ణవాలయాలకు వెళ్లాలి. రోజంతా ఉపవాం ఉండి స్వామి నామస్మరణం చేయడం వల్ల అనుకున్న ఫలితాలు ఉంటాయని అంటున్నారు. అయితే వైకుంఠ ఏకాదశి రోజున ఆలయానికి వెళ్లిన తరువాత రోజంతా పవిత్రంగా ఉండాలి. మద్యం, మాంసం ముట్టకుండా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఎవరితోనూ పరుషంగా మాట్లాడకుండా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగా చూసుకోవాలి.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Why is it called vaikuntha ekadashi how did that name come about
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com