Chanakya Niti : చాణక్య నీతి ప్రకారం.. అసలైన గుణవంతులు అంటే ఎవరు? వారు ఎక్కడ ఉంటారు? చాణక్యుడు చెప్పిన స్టోరీ ఏంటి?

అదే అందంగా ఉన్నా.. గుణవంతుడు కాకపోతే అతని జీవితంతో పాటు సమాజానికి చేటు కలుగుతుంది... అని చాణక్యుడు చెబుతాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా చప్పట్లు కొడుతారు.

Written By: NARESH, Updated On : August 5, 2024 10:25 am

Chanakya Niti

Follow us on

Chanakya Niti : జీవితంలో ఎన్నో సాధించాలని అనుకుంటాం. కానీ ఏ పని చేపట్టినా.. అది పూర్తయ్యే వరకు ఓర్పు ఉండాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా తట్టుకునే శక్తి ఉండాలి. వీటితో పాటు మంచి గుణం కలిగి ఉండాలి. కొందరు డబ్బు సంపాదనే ధ్యేయంగా పని చేస్తారు.. మరి కొందరు సమాజంలో గుర్తింపు రావాలని కోరుకుంటారు. డబ్బుతో పాటు సమాజంలో గౌరవం రావాలంటే మంచి గుణవంతులై ఉండాలి. అపర చాణక్యుడు చెప్పిన ప్రకారం.. మంచి గుణం ఉన్నవారు సమాజంలో ఐశ్వర్యవంతులతో పాటు గుర్తింపును పొందుతారని అని తెలిపాడు. అయితే ఆ గుణవంతులు ఎక్కడ ఉంటారో చాణక్యుడు చెప్పారు. మౌర్య సామ్రాజ్యం విజయవంతంగా కొనసాగడానికి చాణక్యుడే కారణమని చరిత్ర చెబుతుంది. ఆయన చేసిన నియమాలు,చెప్పిన సూచనల ప్రకారం అప్పటి రాజులు నడుచుకునేవారు. కేవలం రాజనీతి బోధనలు మాత్రమే కాకుండా ఒక వ్యక్తి గుణగణాలు ఎలా ఉండాలో చాణక్యుడు చెప్పాడు. ఆయన చెప్పిన సూత్రాలను కొందరు ఇప్పటికీ పాటిస్తూ తమ జీవితాలను సుఖమయం చేసుకుంటున్నారు. సమాజంలో మంచీచెడూ రెండూ ఉన్నాయి. అలాగే దరిద్రులు, గుణవంతులూ ఉన్నారు. వీరిలో అసలైన గుణవంతులు ఎక్కుడ ఉంటారో చాణక్యుడు ఓ సందర్భంగా స్టోరీని వివరిస్తూ చెప్పాడు. ఆయన చెప్పిన ఈ కథ ఇప్పటికీ కొందరు గుర్తు చేసుకుంటూ మంచి మార్గంలో వెళ్లాలని ఇతరులకు సూచిస్తున్నారు. ఒక వ్యక్తి పరిపూర్ణుడు కావడానికి ఈ కథ ఎంతో ఉపయోగపడిందని కొందరు చాణక్యను ఫాలో అవుతున్నవారు చెబుతున్నారు. ఇంతకీ చాణక్యుడు ఎలాంటి స్టోరీ చెప్పాడు? అందులోని నీతి ఏంటి?

చాణక్యుడు ఒకసారి మౌర్య సభలో ఉండగా.. చంద్రగుప్తుడు అతనితో ఇలా ఉన్నాడు. ‘దేవుడు కొందరిపై చిన్న చూపు చూస్తాడు. అందం ఉన్న వారికి గుణం ఇవ్వరు.. గుణం ఉన్న వారికి అందం ఇవ్వరు.. ఉదాహరణకు మీరు ఎంతో సద్గుణవంతులు కానీ దూరం నుంచి చూస్తే కురూపీగా కనిపిస్తారు. అందంగా ఉంటే ఇంకా బాుగండు..’ అని చంద్రగుప్తుడు అంటాడు. దీంతో చాణక్య సమాధానం ఇస్తాడు. ‘మహారాజ ఒక వ్యక్తికి అందం అవసరం లేదు.. మంచి గుణం ఉంటే చాలు.. అందంతో జీవితం సుఖపడదు. కానీ మంచి గుణంతో చక్కటి జీవితం సాగుతుంది’ అని అనగా.. ఇది ఎలా చెప్పగలవు? అని చంద్రగుప్తుడు చాణక్యుడిని ప్రశ్నిస్తాడు.

దీంతో చాణక్యుడు ఒక ఉదాహరణ ఉంది మహారాజ.. అని అంటాడు. అప్పుడు రెండు గ్లాసులు తీసుకురమ్మని అక్కడున్న వాళ్లకు చెబుతాడు. వీటిలో ఒకటి బంగారు గ్లాసు, మరొకటి మట్టి గ్లాసు ఉండాలని చెబుతాడు. ఇలా రెండు గ్లాసులు తీసుకున్న తరువాత అందులో తాగే నీరు పోస్తాడు. అప్పుడు రెండు గ్లాసుల నీళ్లను తాగమని మహారాజును కోరుతాడు. ఆ రెండు గ్లాసుల్లోనీ నీటిని తాగిన తరువాత.. అప్పడు చాణక్యుడు చంద్ర గుప్తుడిని ఇలా అడుగుతాడు.. ‘మహా రాజ ఇప్పుడు మీరు రెండు గ్లాసుల నీళ్లు తాగారు కదా.. ఏ గ్లాసులోని నీరు రుచికరంగా అనిపించింది? అని అడుగుతాడు. దీంతో మహారాజు మట్టి గ్లాసులోని నీరు అని చెబుతాడు..

అప్పుడుు చాణక్యుడు బంగారు గ్లాసు చూడడానికి అందంగా ఉంటుంది. కానీ ఇందులో నీరు తాగితే తృప్తినివ్వదు. అదే మట్టి గ్లాసులోని నీరు తాగడం వల్ల సంతృప్తిగా ఉంటుంది. దీనిని బట్టి ఒక వ్యక్తి కూడా అందంగా లేకున్నా.. అతని గుణం బాగుంటే అతని జీవితం చక్కగా సాగుతుంది. అదే అందంగా ఉన్నా.. గుణవంతుడు కాకపోతే అతని జీవితంతో పాటు సమాజానికి చేటు కలుగుతుంది… అని చాణక్యుడు చెబుతాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా చప్పట్లు కొడుతారు.