https://oktelugu.com/

Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? ఏ సమయంలో ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలంటే?

హిందు సంప్రదాయంలో ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది. మిగతా తిథులతో పోలిస్తే ఏకాదశిని చాలా పవిత్రంగా పూజిస్తారు. అయితే ప్రతీ నెల ఒక ఏకాదశి తప్పనిసరిగా వస్తుంది. ఇలా ఏడాది మొత్తంలో వచ్చే ఏకాదశిలో కంటే ఈ నెలలో వచ్చే ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఇంతటి పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువును పూజించి ఉపవాస దీక్ష ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 4, 2025 / 10:12 PM IST

    Vaikuntha Ekadashi:

    Follow us on

    Vaikuntha Ekadashi: హిందు సంప్రదాయంలో ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది. మిగతా తిథులతో పోలిస్తే ఏకాదశిని చాలా పవిత్రంగా పూజిస్తారు. అయితే ప్రతీ నెల ఒక ఏకాదశి తప్పనిసరిగా వస్తుంది. ఇలా ఏడాది మొత్తంలో వచ్చే ఏకాదశిలో కంటే ఈ నెలలో వచ్చే ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఇంతటి పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువును పూజించి ఉపవాస దీక్ష ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? ఈ ఏడాది ఎప్పుడు జరుపుకుంటారు? ఏ సమయంలో శ్రీ మహా విష్ణువుని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    ఈ ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్తర ద్వార దర్శనం చేస్తారు. అయితే ప్రతి ఏడాది సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరాయనంలోకి ప్రవేశిస్తాడు. దీని కంటే ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. అలాగే పుష్య మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలు అందరితో కలి భూలోకంలోకి అడుగు పెట్టారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీన్ని వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ ముక్కోటి ఏకాదశి అనే స్వర్గానికి మార్గమని, దానికి వెళ్లడానికి ఈ ఏకాదశి నాడే ఓపెన్ అవుతుందని చెప్పుకుంటారు. ఈ వైకుంఠ ఏకాదశి జనవరి 9న గురువారం మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభం అవుతుంది. తర్వాత రోజు జనవరి 10న శుక్రవారం ఉదయం 10:19 గంటలకు ముగుస్తుంది. అంటే ఉదయం తిథి ఉండటంతో జనవరి 10న వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు.

    వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల అంతా మంచే జరుగుతుందని భక్తులు నమ్ముతారు. వీరు ఉపవాసాన్ని జనవరి 11న విరమించాలని పండితులు అంటున్నారు. అయితే భక్తులు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాన్ని ఉదయం 7:15 గంటల నుంచి ఉదయం 8:21 గంటల్లోగా దర్శించుకోవాలని చెబుతున్నారు. ఈ ఏకాదశ నాడు శ్రీ మహా విష్ణువును దర్శించుకోవడం వల్ల సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఇంతటి పవిత్రమైన రోజు తప్పకుండా అందరూ కూడా దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువును భక్తితో పూజించాలి. ఉదయం వేకువ జామున లేచి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి దీపం వెలిగించి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు అంటున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.