Horoscope Weekly: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పుతో కొన్ని రాశుల పై ప్రభావం ఉంటుంది. జనవరి 11 నుంచి జనవరి 18 వరకు వారం రోజులపాటు ఆయా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి : మేష రాశి వారికి ఈ వారం కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ పని మొదలుపెట్టిన ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువ. ఇతరుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా చేయకుండా ఉండడమే మంచిది. వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండకపోవచ్చు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే జీవిత భాగస్వామి మద్దతుతో పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి: ఈ రాశి ఉద్యోగులు ఈ వారం ఉల్లాసంగా ఉంటారు. కార్యాలయాల్లో కొత్త పనిని ప్రారంభించేందుకు సిద్ధమవుతారు. అయితే కొందరు ఈ రాశి వారి పనులకు ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబంలో ఒకరితో వాగ్వాదం ఉండడంతో మానసికంగా ఆందోళనతో ఉంటారు. కొన్ని పనుల నిమిత్తం స్నేహితుల సహాయం అందుతుంది.
మిథున రాశి: ఈవారం మిథున రాశి వారికి అనుకోని అదృష్టం వరించనుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దీంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఎక్కువ. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులో కొత్త వ్యక్తులను కలుస్తారు. వీరితో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సన్నగాలు చేస్తారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే నిర్లక్ష్యం చేయడం వల్ల అవి దూరంగా వెళ్తాయి. అందువల్ల జాగ్రత్తగా పనులను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువ. అయితే వ్యాపారులు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కష్ట సమయాల్లో జీవిత భాగస్వామి మద్దతుగా ఉంటుంది.
సింహా రాశి: ఈ రాశి వారు ఈ వారం కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. కానీ దురదృష్టం వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. అయితే వీరికి స్నేహితుల సహాయం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొందరు మీరు పనులకు ఆటంకాలు కలిగించే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి.
కన్యరాశి: ఈ రాశి వారు ఈ వారం మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే చిన్న మాటతోనే పెద్ద వివాదంలో ఇరుక్కుపోతారు. ఈ వారంలో ఉద్యోగులకు పని భారం ఎక్కువగా ఉంటుంది. కానీ వ్యాపారులకు మాత్రం అనుకోకుండా లాభాలు వస్తుంటాయి. భూమికి సంబంధించిన వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేసే అవకాశం. జీవిత భాగస్వామితో విభేదం కారణంగా మానసికంగా ఆందోళనగా ఉంటారు.
తుల రాశి: ఈ వారం తులా రాశి వారికి అనుకూల ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రశంసలు పొందుతారు. పనితీరుపై సమాజంలో గౌరవం పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. దీంతో సంతోషంగా ఉంటారు. ఇంటికి అతిధుల రాకతో సందడిగా మారుతుంది. ఉద్యోగులకు బంపర్ ఆఫర్లు కలిగే అవకాశం ఉంది. ఆస్తులు విక్రయించడం ద్వారా ఎక్కువ లాభాలు పొందుతారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించేందుకు సిద్ధమవుతారు. వ్యాపారులకు అనుకొని లాభాలు ఉంటాయి. ఇతరుల నుంచి ధన సహాయం పొందుతారు. కొత్త పెట్టుబడులు పెట్టాల్సి వస్తే అవి భవిష్యత్తులో లాభాలను ఇస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండే అవకాశం. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి.
ధనస్సు రాశి: ధనుస్సు రాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసిన ఓపికతో ఉండాలి. లేకుంటే తీవ్ర నష్టాలు ఉండే అవకాశం. వాహనాలపై ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. జీవితానికి సంబంధించిన పర్సనల్ విషయాలను ఎవరితో పంచుకోవద్దు. కుటుంబంలో ఒకరి అనారోగ్యం కారణంతో మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఒక కార్యక్రమంలో కొందరి చేష్టల వల్ల మీకు అవమానం జరిగే అవకాశం.
మకర రాశి : ఈ రాశి వారు గతంలో ఊహించిన దాని కంటే తక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని మార్పులు చేసుకుంటారు. అయితే ఈ మార్పులు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరికి ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి: ఈ రాశి వారు గతంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులు కొత్త మార్పులు చేసుకుంటారు. దీంతో ఉల్లాసంగా గడుపుతారు. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. బంధువుల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు. కుటుంబంలో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
మీనరాశి : మీన రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉండనుంది. మీరు ఏ పని చేపట్టిన విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలంగా మారుతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు వస్తాయి. ఒక కొత్త ప్రాజెక్టును చేపడతారు. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు.