https://oktelugu.com/

Wedding season: మోగనున్న పెళ్లి బాజాలు.. వచ్చే మూడు నెలల్లో ముహూర్తాలు ఇవే!

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మళ్లీ మోగనున్నాయి. ఎంతో పవిత్రమైన భార్యాభర్తల బంధం జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని మంచి ముహూర్తాలు చూసి పెళ్లి చేస్తారు. ఏడాదిలో ఎప్పుడైతే ముహూర్తాలు ఉంటాయో అప్పుడే పెళ్లి చేస్తారు. అయితే నవంబర్‌లో మళ్లీ పెళ్లి బాజాలు ప్రారంభం కానున్నాయి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 17, 2024 / 09:40 AM IST

    wedding season

    Follow us on

    Wedding season: తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మళ్లీ మోగనున్నాయి. ఎంతో పవిత్రమైన భార్యాభర్తల బంధం జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని మంచి ముహూర్తాలు చూసి పెళ్లి చేస్తారు. ఏడాదిలో ఎప్పుడైతే ముహూర్తాలు ఉంటాయో అప్పుడే పెళ్లి చేస్తారు. అయితే మళ్లీ పెళ్లి బాజాలు రానున్నాయి. అది ఎప్పుడో కాదండోయ్.. ఈ నవంబర్‌లో పెళ్లి బాజాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల అనగా నవంబర్ నుంచి ముహూర్తాలు మొదలై.. దాదాపుగా మూడు నెలల పాటు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. పెళ్లి చేసుకోవడానికి మంచి ముహూర్తాలు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మంచి ముహూర్తాలు చూసి పెళ్లిళ్లు చేసుకుంటారు. ఎందుకంటే మంచి ముహూర్తంలో పెళ్లి చేసుకోవడం వల్ల జీవితాంతం గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారని నమ్ముతారు. దీనికోసం ఇద్దరి జాతకాలు చూసి.. వాటి ప్రకారం ముహూర్తాలను ఫిక్స్ చేస్తారు. అయితే ప్రతి ఏడాది ఎక్కువ మంది వేసవిలో పెళ్లిళ్లు చేసుకుంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఎక్కువగా ముహూర్తాలు, వర్షాలు ఉండవని భావిస్తారు. ఆ సీజన్‌లో చేసుకుని వారు తప్పకుండా ఈ సీజన్‌లో ముహూర్తాలు చూసుకుంటారు.

     

    కార్తీక మాసంలో పెళ్లి ముహూర్తాలు మళ్లీ మొదలు కానున్నాయి. నవంబర్ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. నవంబరులో 3వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 10వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ, 17వ తేదీ, 20వ తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కొందరు డిసెంబర్ 15 తర్వాత ముహూర్తాల్లో వివాహం చేసుకోరు. ఎందుకంటే పండుగకి నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో కొత్త దుస్తులు వాడటం, పెళ్లిళ్లు చేసుకోకపోవడం వంటివి చేస్తారు. అయితే ఇది అందరూ కాకుండా కొందరు మాత్రమే పాటిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బాగా పాటిస్తారు. ధనుర్మాసం సమయంలో గృహ ప్రవేశాలు, పెళ్లి ఇలా శుభమైనవి చేయకూడదని పండితులు కూడా చెబుతుంటారు.

     

    నవంబర్ తర్వాత డిసెంబర్‌లో 4, 5, 6, 11, 20, 25 తేదీల్లో వివాహం చేసుకోవడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చే ఏడాది 2025 జనవరిలో 31వ తేదీన ఉదయం, రాత్రి సమయాల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ ఫిబ్రవరి నెలలో 2, 7, 13, 14, 16, 20, 22, 23 తేదీల్లో పగలు, రాత్రి ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మార్చిలో 2, 6వ తేదీల్లో ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఎక్కువ మంది ఈ ఫిబ్రవరి లేదా మార్చి నెలలోనే పెళ్లిల్లు చేసుకుంటారు. ఎందుకంటే ఈ సీజన్‌లో ఎక్కువగా ఎండ, వర్షాలు ఉండవు. దీనివల్ల పెళ్లికి అనుకూలంగా ఉంటుందని చాలామంది భావిస్తారు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉండే పండితులను సంప్రదించడం ఉత్తమం.