https://oktelugu.com/

vastu tips : ఇంటి ముందు ఇవి పెడుతున్నారా? నెగిటివ్ ఎనర్జీకి వెల్ కమ్ చెప్పినట్టే..

విరిగిన వస్తువులు:శుభ సూచకంగా ఉంటుందని ఇంటి ముందు దేవుడి ఫొటోలు పెడతారు. కానీ ఎండ వేడికి ఆ ఫొటోల అద్దాలు పగిలిపోయే అవకాశం ఉంది. ఇల్లు శుభ్రం చేసే సమయంలోనూ కూడా ఫొటోలు దెబ్బతినే అవకాశం ఉంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 19, 2024 / 11:00 PM IST

    house, put these in front of house, negative energy

    Follow us on

    vastu tips : ఇల్లు కట్టుకునే సమయంలో చాలా విషయాలు పట్టించుకుంటారు. ఇంటి ఫేసింగ్, వాస్తు, స్థలంలో దోషాలు, వీధి శూల ఇలాంటి ఎన్నో విషయాల గురించి పట్టించుకుంటారు. ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా చాలా విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టాలి? ఇంటి ముందు ఎలాంటి వస్తువులు ఉండాలి అనే విషయాల గురించి కచ్చితంగా అవగాహన ఉండాలి. అయితే ఇంటి ముందు ఎలాంటి వస్తువులు ఉండకూడదో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

    ఎండిన మొక్కలు: ఇంటి మెయిన్ డోర్ వద్ద చిన్న కుండీల్లో మొక్కలు పెంచడం అలవాటుగా ఉందా? అయితే వాటి సంరక్షణ మీద కూడా దృష్టి పెట్టాలి. లేదంటే చనిపోతాయి. చనిపోయిన మొక్కలను వెంటనే తీసివేయండి. ఎండిపోయిన మొక్కలు, ముళ్ల మొక్కలు ఇంటి ముందు ఉండకూడదు. లేదంటే నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందంటున్నారు వాస్తు పండితులు. కష్టాలు, అనారోగ్య సమస్యలు వస్తాయట.

    పదునైన కత్తులు: ఇంటి మెయిన్ డోర్ వద్ద పదునైన కత్తులు, ఇనుప వస్తువులు పెట్టవద్దు. వీటివల్ల ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశం ఉందట. వాస్తు ప్రకారం ఇలాంటివి ఇంటి ముందు ఉంటే స్నేహితులు, బంధువులతో గొడవలు జరిగే ఛాన్స్ ఉంది.

    ముదురు రంగు: ఇంటి ముందు నల్ల చాపలు, విగ్రహాలను ఉంచవద్దు. . వీటివల్ల పాజిటివ్ ఎనర్జీ బ్రేక్ అవుతుంది. అందువల్ల లేత రంగులతో ఇంటి గోడలు, డిజైన్లు వేయించుకోండి.

    చెత్త డబ్బాలు: నెగెటివ్ ఎనర్జీని ఆకర్షించే లక్షణాలున్న డస్ట్ బిన్లను విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఇలాంటి చెత్తను ఎవరికి కనిపించని ప్లేస్ లో పెట్టడం చాలా ముఖ్యం. చెత్త చెడును సంకేతం. అందువల్ల ఇంటికి వచ్చే వారికి ముందుగా చెత్త డబ్బా కనిపించడం మంచిది కాదు. దీనివల్ల వారు బ్యాడ్ గా ఫీలవుతారు.

    సెప్టిక్ ట్యాంకులు: ఇల్లు కట్టే ముందే సెప్టిక్ ట్యాంక్ ల విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటి మెయిన్ డోర్, గేట్ వద్ద సెప్టిక్ ట్యాంకులు ఉండవద్దు. దుర్వాసన, క్రిమి కీటకాలు మెయిన్ డోర్ నుంచే లోపలికి వస్తాయి. తుఫానులు, వర్షాల సమయంలో ట్యాంకుకు ప్రమాదం జరిగినా సరే ఇంటికి హాని కలుగుతుంది. ఇక ఈ ట్యాంకులు నెగెటివ్ సెన్స్ తో కూడి ఉంటాయి. అందువల్ల ఇంటి ముందు సెప్టిక్ ట్యాంకులు ఉంచకండి.

    చెప్పులు: ఇంటి ముందు చెప్పులు ఉంచవద్దు. ఎందుకంటే చెప్పులు శనికి ప్రతిరూపం. అందువల్ల ఇంటి ముందు వాటిని వదిలితే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంతేకాదు ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన చెప్పులు ఇంటి ముందు వదిలితే..క్రిములు, వైరస్ లు ఇంటిలోకి వస్తాయి.అందుకే ఇంటి ముందు, ముఖ్యంగా ప్రధాన ద్వారం ముందు చెప్పులు వదలడం మానుకోండి.

    విరిగిన వస్తువులు:శుభ సూచకంగా ఉంటుందని ఇంటి ముందు దేవుడి ఫొటోలు పెడతారు. కానీ ఎండ వేడికి ఆ ఫొటోల అద్దాలు పగిలిపోయే అవకాశం ఉంది. ఇల్లు శుభ్రం చేసే సమయంలోనూ కూడా ఫొటోలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఇలాంటివి ఇంటి ముందు పెట్టవద్దు. పగిలిన పూల కుండీలు, అద్దాలు, విరిగిన కుర్చీలు కూడా ఇంటి ముందు నిషేధం.

    పాడైన దిష్టి బొమ్మలు: దిష్టి తగలకుండా ఇంటికి గుమ్మడి కాయలు, పటిక, మిరపకాయలు, రాక్షస బొమ్మలు, రెడ్ క్లాత్ వంటివి ఇంటి మెయిన్ డోర్ కు కడుతారు. ఈ వస్తువులు పాడైతే పట్టించుకోని వారు కూడా ఉన్నారు. కానీ ఇలా చేయడం చాలా డేంజర్ అంటున్నారు పండితులు. దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందట. దిష్టి గుమ్మడి కాయలు, క్లాత్ వంటివి పాడైపోతే మార్చేయండి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.