Vastu: హిందువులు ముఖ్యంగా వాస్తును పాటిస్తారు. ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు తప్పకుండా వాస్తు చూసుకుంటారు. వాస్తులు చూసుకున్న తర్వాతే ఇంటిని నిర్మిస్తారు. ఇలా వాస్తులు అన్ని చూసుకుని ఇంటి నిర్మాణం చేపట్టడం వల్ల ఇంట్లో అంతా మంచే జరుగుతుందని, ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. అయితే కొందరు తెలియక ఇంట్లో కొన్ని చిన్న తప్పులు చేస్తుంటారు. తెలిసో తెలియక ఇంట్లో పెట్టాల్సిన చోటులో వస్తువులు పెట్టరు. దీనివల్ల దీర్ఘకాలికంగా బాధలు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా కుటుంబం మొత్తం ఉండాలంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. మరి ఆ నియమాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
బీరువా ఈ దిశలో పెట్టాలి
బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు. కొందరికి తెలియక సరైన దిశలో బీరువాను పెట్టరు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అయితే లక్ష్మీదేవి అయిన బీరువాను దక్షిణం, తూర్పు దిశల్లో పెట్టాలి. అంటే బీరువా ఓపెన్ చేయగానే దక్షిణం లేదా పడమర రావాలి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కలిగి మీ అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఎవరికైనా అప్పుగా డబ్బు ఇస్తే అది కూడా తిరిగి వస్తుంది. అలాగే మీ ఇంట్లో డబ్బు వృద్ధి చెందుతుంది. కుటుంబ అంతా సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి.
బీరువాలో ఈ వస్తువులు ఉంచితే..
బీరువాలో కొందరు తెలియక ఉంచిన వస్తువుల వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. బీరువాలో బంగారం, వెండి, డబ్బు వంటి వస్తువులు ఉంచాలి. చాలా శుభ్రంగా బీరువాను ఉంచాలి. బీరువాలో పాత వస్తువులు, చెత్త వంటి వస్తువులను కూడా ఉంచకూడదు. వీటివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు అన్ని పెరిగిపోతాయి. అలాగే బీరువాను ఎప్పుడు పడితే అప్పుడు ముట్టకూడదు. అమ్మాయిలు పీరియడ్స్ సమయంలో బీరువాను ఓపెన్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఇంట్లో ఉండదు.
దీపం వెలిగించండి
కొందరు అసలు ఇంట్లో దీపం వెలిగించరు. ఎప్పుడో ఏదో పూజ ఉంటేనే మాత్రం వెలిగిస్తారు. లేకపోతే అసలు దేవుని వైపు కూడా చూడరు. ఇంట్లో మహిళలు తప్పకుండా రోజూ దీపం వెలిగించాలి. అప్పుడే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. కొందరు వ్యక్తిగత పనులు, దేవుడి మీద నమ్మకం లేక ఇంట్లో అసలు పూజలు నిర్వహించరు. ఆలస్యంగా లేవడం వంటి పనులు చేస్తుంటారు. ఇలాంటి ఇంట్లో అసలు లక్ష్మీ దేవి ఉండదని పండితులు అంటున్నారు. కాబట్టి వేకువ జామునే లేచి అన్ని పనులు చేసి ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించడం అలవాటు చేసుకోండి. దీనివల్ల ఆర్థిక సమస్యలు అన్ని మాయం అయి కుటుంబమంతా సంతోషంగా ఉంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.