https://oktelugu.com/

Varudini Ekhadashi :మే 4న వరూథిని ఏకాదశి.. ఈరోజు విష్ణువు అనుగ్రహం కోసం ఏం చేయాలో తెలుసా?

హిందూ శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేయడం ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకుంటారు.శ్రీ మహా విష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు. ఇందులో వామన అవతారం ఒకటి. ప్రతీ ఏడాది చైత్ర మాసంలో వరుథిని ఏకాదశి రోజున వామనుడిని పూజించడం వల్ల వారి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : April 29, 2024 4:26 pm
    varudini ekadasi

    varudini ekadasi

    Follow us on

    Varudini Ekhadashi :శ్రీ మహా విష్ణువు అవతారం అయిన వామనుడికి ప్రత్యేకత ఉంది. వామనుడి చరిత్ర అందరికీ తెలుసు. కానీ ఆయనను పూజించే సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా చైత్ర మాసంలోని వరుధిని ఏకాదశి రోజు ప్రత్యేకంగా వామనుడిని పూజిస్తారు. 2024 సంవత్సరంలో మే 4వ రోజున వరుతిని ఏకాదశిని జరుపుకోనున్నారు.ఈరోజు కొన్ని వస్తువులతో ప్రత్యేక పూజలు చేయడం వల్ల వారి జీవితంలో ఎన్నో సంతోషాలు కలగనున్నాయి. అలాగే కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మహా విష్ణువు కరున కటాక్షాలు పొందుతారు. ఆ వివారాల్లోకి వెళితే..

    హిందూ శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేయడం ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకుంటారు.శ్రీ మహా విష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు. ఇందులో వామన అవతారం ఒకటి. ప్రతీ ఏడాది చైత్ర మాసంలో వరుథిని ఏకాదశి రోజున వామనుడిని పూజించడం వల్ల వారి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈసారి మే 4న వరుథిని ఏకాదశి రానుంది. ఈ రోజున చేసే కార్యక్రమాలు ఏవంటే?

    వరుథిని ఏకాదశి రోజున కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల వామనుడి అనుగ్రహం పొందుతారు. ఈరోజు అన్నదానం చేయడం వల్ల పూర్వీకులు సంతృప్తి చెందుతారు. ఇంతకాలం ఏవో బాధలు పడుతున్న వారు ఈరోజుతో సంతోషంగా ఉంటారు. అన్నదానం చేయడం వల్ల పలువురు తమ దీవెనలు అందిస్తారు. ఇలా శ్రీ విష్ణువు వారి రూపంలో అన్నదానం చేసిన వారికి శుభాలు కలగాలని దీవిస్తాడట.

    చైత్రమాసం దాదాపుగా వేసవికాలంలో వస్తుంది. ఇదే మాసంలో వరుథిని ఏకాదశి వస్తుంది. ఈరోజున ఇతరుల దాహార్తి తీర్చడం వల్ల ఎంతో పుణ్యఫలం పొందుతారు. ఎండలో ఇతర పనుల కోసం వచ్చిన వారిని గానీ, లేదా చలి వేంద్రాల ద్వారా ఇతరుల దాహార్తి తీర్చడం వల్ల మహా విష్ణువ అనుగ్రహం పొందుతారట. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి.