Rashi Phalalu: ఈ రాశివారి జీవితంలో అనూహ్య మార్పులు..

వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. వివాహితులు సంతోషంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక అదృష్టం వరిస్తుంది. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు విజయం సాధిస్తారు.

Written By: Chai Muchhata, Updated On : January 10, 2024 8:42 am

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జనవరి 10న బుధవారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. అలాగే మకర సంక్రాంతి నేపథ్యంలో బుధవారం చంద్రుడు ధనస్సు రాశిలో ప్రవేశించనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి అదృష్టం వరించనుంది. అలాగే ఈరోజు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
గతం నుంచిపెండింగులో ఉన్న సమస్యలు పరిస్కారం అవుతాయి. ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి ప్రేమ, ఆప్యాయత పొందుతారు.

వృషభం:
వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. వివాహితులు సంతోషంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక అదృష్టం వరిస్తుంది. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు విజయం సాధిస్తారు.

మిథునం:
వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు అనుకూల సమయం. ఉద్యోగులకు తోటివారి సహకారం ఉంటుంది.

కర్కాటకం:
వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారు కుటుంబ సభ్యులతో చర్చించాలి. వీరి జీవితంలో కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు.

సింహ:
ప్రేమానుబంధాలు బలపడుతాయి. కుటుంబ సభ్యులకు అన్ని రంగాల నుంచి మద్దతు లభిస్తుంది. కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది.

కన్య:
వ్యాపారులకు భాగస్వాముల నుంచి సహాయం అందుతుంది. ప్రియమైన వారితో విభేదాలు ఏర్పడుతాయి. వాదనలకు ఎక్కువగా దిగకుండా ఉండాలి.

తుల:
ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. మీ మాటలు వారిని ఆకర్షిస్తాయి. కొన్ని ఒత్తిడులు ఎదురైనా చాకచక్యంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు.

వృశ్చికం:
స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో విభేదాలు రావొచ్చు. వ్యాపారులు పెట్టుబడులు పెడితే ఇతరుల సలహాలు తీసుకోవాలి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం.

ధనస్సు:
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రయాణాలు చేసేవారు ఆనందంగా గడుపుతారు. కొత్త స్నేహం చేస్తారు. కుటుంబ సభ్యుల సాయం అందుతుంది.

మకర:
శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గరి వారే మిమ్మల్ని బాధపెట్టవచ్చు. స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుది.

కుంభం:
దగ్గరి వారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది. వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

మీనం:
మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.