Ugadi 2025 (1)
Ugadi 2025: తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇదే రోజున కొత్త పంచాంగాన్ని ఆవిష్కరిస్తారు. భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి పంచాంగంను పండితులు ఆలయాల్లో వినిపిస్తారు. ఈ సందర్భంగా తన రాశి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అయితే విశ్వావసునామ సంవత్సరం 2025 పంచాంగం ప్రకారం ఆయా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం:
ఈ రాశి వారికి కొత్త సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7 గా ఉన్నాయి. ఈ రాశి వారు ప్రతి మార్గంలో తాము అనుకున్నవి సాధిస్తారు. సమాజంలో గుర్తింపు వస్తుంది. ఉద్యోగాలు చేసేవారు ఆశించిన ఫలితాలను పొందుతారు. అయితే ద్వితీయార్థంలో గురుబలం తక్కువగా ఉంటుంది. దీంతో వ్యాపారులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు.. రావు కూడా ఈ రాశిపై ఎక్కువ ప్రభావం చూపుతాడు.
వృషభం:
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3.. ఈ రాశి వారికి ఈ ఏడాది ఆర్థిక ప్రయోజనాలు వరించనున్నాయి. గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. ద్వితీయార్థంలోనూ ఈ రాశి వారికి మంచి ఫలితాలే ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలను నిర్వహిస్తారు. శని ప్రభావం ఉన్న ఈ రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. సంపదలు పెరుగుతాయి. ఉద్యోగులు నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.
మిథునం:
ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి ఆదాయం ఎక్కువగా ఉండడంతో ఆర్థిక గా పుంజుకుంటారు. కొన్ని పనుల్లో అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అయితే మానవ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. ద్వితీయార్థంలో ఉద్యోగులకు ఉపాధి పెరుగుతుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. సొంత వాహనాలపై వెళ్లేవారు దూర ప్రయాణాలు చేయవద్దు.
కర్కాటకం:
ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3.. మీ రాశి వారికి ఈ ఏడాది ఖర్చులు తగ్గుతాయి. దీంతో అనుకోకుండానే ఆదాయం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని అనుకున్న పనులు పూర్తి చేయడంతో సంతృప్తి కలుగుతుంది. ఉద్యోగులు వరుసగా విజయాలు సాధిస్తారు. అయితే ద్వితీయార్థంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఫైనాన్స్ కు సంబంధించి ముందు జాగ్రత్తలు ఉండాలి. దుబారా ఖర్చులను తగ్గించాలి. ప్రయాణాలకు వెళ్లకుండా ఉండాలి.
సింహం:
ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6.. ఈ రాశి వారికి ఏడాది ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అయితే ఖర్చులు కూడా ఉండడంతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సవాళ్లు ఎదురవుతాయి వాటిని అధిగమించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. రెండు భాగంలో గురువు బలం ఎక్కువగా ఉంటుంది. దీంతో అనుకున్న విజయాలు సాధిస్తారు. అయితే ఈ రాశిపై శని ప్రభావం ఉండడంవల్ల సంబంధాల్లో చీలికను ఏర్పడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 7 .. ఈ రాశి వారికి ఈ ఏడాది అదృష్టం వరించనుంది. కొన్ని పనులు అనుకోకుండానే పూర్తవుతాయి. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని పెట్టే పెట్టుబడులు లాబిస్తాయి. రెండో భాగం లో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. లక్ష్యాలను పూర్తి చేయడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. వీరికి రాహు కొన్ని సమస్యలను సృష్టించే అవకాశం ఉంది. పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఆధ్యాత్మిక భావాలు పెంపొందుతాయి. దీంతో దైవభక్తి పెరుగుతుంది. ఆలోచనలు దారి తప్పకుండా చూసుకోవాలి.
తుల:
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2.. ఈ రాశి వారు ఈ ఏడాది సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. అనుకున్న విజయాలు అన్ని పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. రెండో భాగం లోను ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుంది. గతంలో మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. శని ప్రభావం ఉండడం వల్ల అంతా మంచే జరుగుతుంది. అయితే కొన్ని వస్తువుల కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సంబంధాల్లో చీలిక రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారులు కొత్త వ్యక్తులతో ఒప్పందాలు చేసుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలి.
వృశ్చికం:
ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2.. ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం స్వల్పంగా ఉంటుంది. అయితే ఖర్చులు పెరగడంతో పరిమితులు విధించుకోవాలి. అవమానం కంటే రాజ్య పూజ్యం అధికంగా ఉంటుంది. అయితే సమాజంలో గుర్తింపును పొందుతారు. కానీ అనుకున్న ఆదాయం పొందలేరు. రెండో భాగంలో దూర ప్రయాణాలు మానుకోవాలి. రాహు ప్రభావం వల్ల కొన్ని పనుల్లో ఆటంకాలు జరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోవడంతో కష్టాలను ఎదుర్కొంటారు. అయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.
ధనుస్సు:
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5.. ఏడాది ఈ రాశి వారికి స్థిరాస్తులు పెరుగుతాయి. అంతే స్థాయిలో ఖర్చులు కూడా ఉంటాయి. వ్యాపారులకు భాగస్వాముల సహకారం ఉంటుంది. దీంతో అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగులు ప్రశంసా పత్రాలు అందుకుంటారు. అయితే ఏదైనా ఫస్ట్ చేసేటప్పుడు బాగా ఆలోచించాలి. ద్వితీయార్థంలో మానసికంగా ఒత్తిడికి గురవుతారు. విజయాలను అడ్డుకునేందుకు కొందరు రెడీ అవుతారు. అయితే ఏ పనైనా ఓర్పుతో చేయాలి. లౌక్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి.
మకరం:
ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం .. ఈ రాశి వారికి వ్యయం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తప్పనిసరిగా ఉండాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కానీ అనుకున్న ఆదాయం లభించదు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అయితే రెండో భాగంలో అనుకున్న విజయాలు సాధిస్తారు. కొన్ని పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోవడంతో నష్టాలు ఎదురవుతాయి.
కుంభం:
ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం5 .. ఈ రాశి వారికి ఈ ఏడాది స్థిరాస్తులు పెరుగుతాయి. అవమానం కంటే రాజపూజం ఎక్కువగా ఉండడంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. అయితే ఖర్చులుఎక్కువగా ఉంటాయి. పొదుపు విషయంలో ఎక్కువగా కేర్ తీసుకోవాలి. రెండో భాగంలో కుటుంబ జీవితం ఇబ్బందికరంగా మారుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని పొరపాట్లు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఆత్మీయులే మోసం చేసే అవకాశం ఉంటుంది.
మీనం:
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1.. ఈ రాశి వారు ఏడాది కొత్త అవకాశాలను చేజిక్కించుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే రాణిస్తారు. రెండో భాగంలో ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ఇబ్బందులు ఉంటాయి. ఎవరితోనైనా మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం, వ్యయం సమానంగా ఉన్నందున ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోతారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Ugadi 2025 rashi phalitalu panchangam
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com