Today July 19 2025 Horoscope: గ్రహాల మార్పుకు అనుగుణంగా కొన్ని రాశుల పరిస్థితులు మారుతూ ఉంటాయి. శనివారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల ఉద్యోగుల వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. మరికొన్ని రాశిలో వ్యాపారులు కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సివస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో ఎటువంటి అలజడి లేకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తితే వెంటనే పరిష్కరించుకోవాలి. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈరోజు ఆర్థికపరమైన కష్టాలు ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులను చేపడతారు. వీటిని పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఎవరితోనూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తారు. అందుకు అనుకూలంగా ఫలితాలను పొందుతారు. జల్సా లకు అదనంగా ఖర్చులు అవుతాయి. అందువల్ల ఆచూకీ చూచి వ్యవహరించాలి. వ్యాపారులు పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. అయితే వీటిని దృష్టిలో ఉంచుకొని కొత్తపెట్టబడులు పెట్టాలి. అవసరమైతే పెద్దల సలహా తీసుకోవాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో సమయమనం పాటించాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. వీటిలో కొందరు విజయం సాధిస్తారు. సంతోషంగా ఉండేందుకు స్నేహితులతో ప్రయాణం చేస్తారు. దూరపు బంధువుల నుంచి ఒక సమాచారం అందుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . గతంలో అనుకున్న ఒక పని ఈరోజు నెరవేరుతుంది. డబ్బుకు సంబంధించి జీవిత భాగస్వామితో క్లారిటీ ఉండాలి. లేకుంటే విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని మనస్పర్ధలు వస్తాయి. వీటిని వెంటనే పరిష్కరించుకోవాలి. భవిష్యత్తు గురించి విద్యార్థులు ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంటారు. వీరికి తల్లిదండ్రుల మద్దతు కూడా ఉంటుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఆలోచనలను నియంతించుకోవాలి. కొందరు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారితో దూరంగా ఉండటమే మంచిది. ఇంకా వస్తువులు కొనుగోలు చేయడంపై శ్రద్ధ పెడతారు. అయితే అనవసరపు ఖర్చులపై కూడా జాగ్రత్తలు ఉండాలి. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. కానీ ఇదే సమయంలో కొందరు భాగస్వాముల తో విభేదాలు ఉంటాయి. ఉద్యోగులు అధికారుల నుంచి కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ప్రత్యర్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆర్థిక వ్యవహారాల్లో అనవసరపు జోక్యం చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తారు. మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఉల్లాసంగా ఉండేందుకు స్నేహితులను కలవచ్చు. లేదా జీవిత భాగస్వామితో ఆర్థిక విషయాలపై చర్చించాలి. పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహా తీసుకోవడం మంచిదే. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదు. ఇంట్లో విషయాలపై ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఉద్యోగులు తమ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. దీంతో వారి నుంచి ప్రశంసలు పొందడమే కాకుండా కొందరు పదోన్నతులు కూడా పొందుతారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయం అవుతారు. అదనపు ఆదాయాన్ని పొందేందుకు ప్రణాళిక వేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయినా అందుకు అనుగుణంగా ఆదాయాన్ని పొందుతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . వ్యాపారం చేసేవారు ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు అనవసరంగా ఖర్చులు ఉంటాయి. అయితే అవసరమైన వాటికి మాత్రమే ఖర్చులు చేయాలి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులపై చేసే ప్రయత్నాలు పలిస్తాయి. తోటి వారితో సంయమనం పాటించాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తుంటాయి. అయితే సోదరుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. గతంలో అనుకున్న కొన్ని వస్తువులను ఈరోజు కొనుగోలు చేస్తారు. వ్యక్తిత్వ అభివృద్ధి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . రాజకీయాల్లో ఉండే వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉండలున్నాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు అవసరం. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం గురైతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఉద్యోగులు తమ తోటి వారితో సమయమును పాటించాలి. విభేదాలు ఉండడం వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. పర్సనల్ విషయాలను భాగస్వాములతో పంచుకోకుండా ఉండడమే మంచిది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. దూరపు బంధువుల నుంచి అందుకున్న ఓ సమాచారంతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేస్తారు. ఉద్యోగులు పదోన్నతి గురించి శుభవార్తలు విని అవకాశం ఉంది. ఖర్చులు ఉంటున్నా.. ఆదాయం రావడంతో ఇబ్బందులు ఉండవు.