Today June 18 2025 horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండరున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ప్రణాళిక లేకుండా ఏ పనిని మొదలు పెట్టరాదు. ఆదాయం పెరుగుతూ తగ్గుతుంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు చాకచక్యంగా వ్యవహరించాలి. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ఎదుటివారితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణము ఉండదు. అందువల్ల సీనియర్లతో సంయమనం పాటించాలి. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రణాళికలు రచించాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఏ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తే లభిస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. ప్రణాళిక ప్రకారం గా పెట్టుబడులు పెడతారు. కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదనపు ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. పూర్వీకుల ఆస్తి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పెండింగ్లో ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆగిపోయిన ఆదాయం వసూల్ అవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు మానసికంగా సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో భాగోద్వేగాంగా ఉండగలుగుతారు. ఆర్థిక సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులపై కుటుంబంతో చర్చిస్తారు
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సంతోషంగా ఉండగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. కొత్త పెట్టుబడులు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆరోగ్య సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంది. నాయకత్వ పాత్రలో ఉన్నవారు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు పొందుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాజు వారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. గతంలో చేపట్టిన పని పూర్తి చేసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో కీలక విషయం చర్చిస్తారు. ఇప్పుడు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో దీర్ఘకాలిక ఆదాయాన్ని తీసుకువస్తాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాస్త సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు అలాగే ఉండిపోతాయి. వస్తువుల కొనుగోలు విషయంలో అయోమయాన్ని ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఉంటారు. అనుకోకుండా చేసే ప్రయాణం కొన్ని ఇబ్బందులను తీసుకువస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆస్తి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రణాళిక ప్రకారంగా పెట్టుబడులు పెడతారు. దీంతో భవిష్యత్తులో లాభాలు ఉండే అవకాశం ఉంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒంటరిగా ప్రయాణం చేసేవారు ఆందోళనకుతో ఉంటారు. తోబుట్టువుల మధ్య విభేదాలు రావడంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కొత్త బాధ్యతలను చేపడతారు. ఆర్థికంగా భారాన్ని ఎదుర్కొంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకుంటారు. బ్యాంకు రుణాలు అందుతాయి. దీంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఈరోజు ప్రయాణాలు అంతా మంచిది కాదు. విద్యార్థుల కెరీర్ గాడిన పడుతుంది. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.